AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPS Based Toll: వెయిటింగ్ లేకుండా టోల్ చెల్లింపులకు కొత్త రూల్స్.. ప్రతి మీటర్ ప్రయాణానికీ ఛార్జ్ వసూలు..

GPS Based Toll: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న టోల్‌ వసూళ్ల పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల కాలంగా ఉన్న టోల్‌ప్లాజాల వ్యవస్థను తొలగించే దిశగా  అడుగులు వేస్తోంది.

GPS Based Toll: వెయిటింగ్ లేకుండా టోల్ చెల్లింపులకు కొత్త రూల్స్.. ప్రతి మీటర్ ప్రయాణానికీ ఛార్జ్ వసూలు..
Toll
Ayyappa Mamidi
|

Updated on: May 04, 2022 | 9:54 PM

Share

GPS Based Toll: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న టోల్‌ వసూళ్ల పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల కాలంగా ఉన్న టోల్‌ప్లాజాల వ్యవస్థను తొలగించే దిశగా  అడుగులు వేస్తోంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో జీపీఎస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త విధానాన్ని తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకూ నిర్ణీయ దురం ఆదారంగా టోల్ వసూలు చేస్తున్నారు. వాటి ద్వారా రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ఈ సొమ్మును వినియోగిస్తుంది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఫాస్టాగ్‌ విధానాన్ని కొంత కాలం నుంచి తీసుకొచ్చింది.

ఫాస్టాగ్‌ వల్ల అన్ని టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పూర్తిగా తగ్గి వాహనదారుల ప్రయాణం సులువుగా మారింది. ఇప్పుడు జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులువుగా మార్చేందుకు కేంద్ర రవాణా శాఖ టోల్‌ప్లాజాలు లేని వ్యవస్థకు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. శాటిలైట్‌ ఆధారిత జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానం అమలుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. 1.37 లక్షల కార్లపై ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

ప్రయాణించి దూరం ఎలా లెక్కిస్తారు..

రోడ్లపై ప్రయాణించే 97 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. కాబట్టి.. డిజిటల్ గా డబ్బు వసూలు చేసేందుకు మౌలిక సదుపాయాలు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు కావలసిందల్లా ఈ కార్లు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడమే. అందుకు జీపీఎస్​ వ్యవస్థను వినియోగించనున్నాయి. జీపీఎస్​ ట్రాకింగ్​ విధానం​ ద్వారా టోల్​ రోడ్లపై కార్లు ప్రయాణించే కిలోమీటర్లను లెక్కించి ఆటోమేటిక్ గా సదరు కారు ఫాస్టాగ్ నుంచి డబ్బును వసూలు చేస్తారు.

రేట్లు ఎలా..

కారు టోల్ రోడ్డు పైకి వచ్చిన వెంటనే ప్రభుత్వం టోల్​ టాక్స్​ వసూలునూ ప్రారంభిస్తుంది. కారు ప్రయాణించే కిలోమీటర్లపై ఛార్జీ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారు. జీపీఎస్​ నేవిగేషన్​ పరికరాలతో ప్రస్తుతం 1.37 లక్షల కార్లపై ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. రష్యా, దక్షిణ కొరియా నిపుణులు దీనిపై నివేదిక తయారు చేస్తున్నారు. అమలులో ఎదురైన లోటుపాట్లను పరిశీలించి పాలసీని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో ఈ వ్యవస్థ అందరికీ వర్తించనుంది.

ఫాస్టాగ్​లో డబ్బులు లేకపేతే..

కొన్ని సార్లు కార్ల యజమానులు.. తమ ఫాస్టాగ్​ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోకుండా ప్రయాణాల్ని మొదలు పెడుతుంటారు. అటువంటి వారి కోసం ఓ అవకాశం ఉంది. అదేంటంటే.. ప్రయాణం పూర్తైన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి వద్ద నుంచి బిల్లు రికవరీ చేసుకుంటుంది .

ఈ సరికొత్త వ్యవస్థ వల్ల కేంద్రాని మరింత ఆదాయం పెరగనుంది. ఎందుకంటే కారు ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు టోల్ వసూలు చేస్తుంది కాబట్టి. ప్రస్తుతం చాలా మంది టోల్​ ప్లాజాను తప్పించుకోవడానికి వేరే మార్గాల ద్వారా ప్రయాణాల్ని చేస్తున్నారు. వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇది సరైన మార్గమని నిపుణులు అంటున్నారు. ఈ వ్యవస్థ వల్ల కొన్ని సందర్భాల్లో కార్ల యజమానులకు కూడా లాభమే అని అంటున్నారు. కొన్ని సార్లు ప్రయాణించే దూరం తక్కువే అయినా టోల్​ ఛార్జీ ఎక్కువగా కట్టాల్సి వస్తుంటుంది. కాబట్టి ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే ఈ వ్యవస్థ వసూలు చేయనుండడం వల్ల వాహనాదారులకు లాభమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిని తప్పనిసరి చేస్తే పాత కార్ల యజమానులు సైతం జీపీఎస్‌ పరికరాలను అమర్చుకోవటం తప్పనిసరి. ఇప్పటికే ఈ వ్యవస్థ యూరోపియన్ దేశాల్లో అమలులో ఉంది. జర్మనీలో దాదాపు 99 శాతం వరకు కార్లు జీపీఎస్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ అయి ఉన్నాయి. కారు టోల్​ రహదారిలోకి ప్రవేశించిన వెంటనే పన్ను లెక్కింపు ప్రారంభమవుతుంది. అది హైవే నుంచి ఊరిలోకి వచ్చిన వెంటనే.. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో దానికి అనుగుణంగా టాక్స్ వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Education: దేశంలో అందని ద్రాక్షగా మారుతున్న ప్రైవేటు విద్య.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే..

Jack Ma: చైనా వ్యాపారవేత్త ‘జాక్ మా’ అరెస్ట్? కుప్పకూలిన అలీబాబా కంపెనీ షేర్లు.. పూర్తి వివరాలు