Jack Ma: చైనా వ్యాపారవేత్త ‘జాక్ మా’ అరెస్ట్? కుప్పకూలిన అలీబాబా కంపెనీ షేర్లు.. పూర్తి వివరాలు

Jack Ma: వ్యాపార రంగంలో జాక్ మా అంటే తెలియని వారు ఉండరనేది అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించింన అలీబాబాలో షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

Jack Ma: చైనా వ్యాపారవేత్త 'జాక్ మా' అరెస్ట్? కుప్పకూలిన అలీబాబా కంపెనీ షేర్లు.. పూర్తి వివరాలు
Jack Ma
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 04, 2022 | 7:05 PM

Jack Ma: వ్యాపార రంగంలో జాక్ మా అంటే తెలియని వారు ఉండరనేది అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించింన అలీబాబాలో షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎందుకంటే చైనాలో(China) ‘మా’ అనే ఇంటి పేరుతో ఉన్న ఒక వ్యక్తిని అక్కడి అధికారులు అరెస్టు చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కంపెనీ షేర్లు అనూహ్యంగా ఒక్కసారిగా పతనం కావటంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఈ షేర్ల విలువ పతనం కారణంగా కంపెనీ విలువ ఏకంగా 27 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యింది. దీనికి కారణం ఏమిటంటే అరెస్టు అయిన వ్యక్తి బిలియనీర్(Billionaire) జాక్ మా అని పెట్టుబడిదారులు భావించటమేనని తెలుస్తోంది.

ఇన్వెస్టర్లు ఇలా అనుకోవటానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు చైనా ప్రభుత్వ విధానాలపై బాహాటంగానే విమర్శలు చేయటంతో జాక్ మా చిక్కుల్లో పడ్డారు. ఆ సమయంలో ఆయన అనేక నెలల పాటు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లటం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు చైనా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఆయనకు చెందిన యాంట్ గ్రూప్‌ తీసుకొస్తున్న  ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీవోను అక్కడి ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి తోడు ఆ తరువాత కూడా జాక్ మా కంపెనీలపై అనేక శాఖలకు చెందిన అధికారులు దాడులు చేయటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

అలీబాబా స్వస్థలమైన హాంగ్‌జౌలోని పోలీసులు ‘మా’ అనే ఇంటిపేరుతో ఉన్న వ్యక్తిపై “తప్పనిసరి చర్యలు” తీసుకున్నారని చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ మెుదటగా వార్తను ప్రసారం చేసింది. జాతీయ భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ వార్తతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను అమ్మటం ప్రారంభించారు. ఈ కారణంగా షేర్ విలువ ఏకంగా 9.40 శాతం క్రాష్ అయింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి చైనీస్ టెక్ కంపెనీలో హార్డ్‌వేర్ రీసెర్చ్ డైరెక్టర్ అని తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ 2019 నివేదిక ప్రకారం, ‘మా’ అనేది చైనాలో 13వ అత్యంత సాధారణ ఇంటిపేరని తెలుస్తోంది. 12 మిలియన్ల జనాభా ఉన్న హాంగ్‌జౌ ‘మా’ అనే ఇంటి పేరుతో 1,00,000 కంటే ఎక్కువ మంది ఉండవచ్చని తెలుస్తోంది. ఏడాది ప్రారంభంలో యాంట్ గ్రూప్‌ అవినీతి కుంభకోణంలో చిక్కుకున్నాయి. ఆ సమయంలో బిలియనీర్‌పై ఒత్తిడి పెంచటం వల్ల.. అతని ఇంటర్నెట్ సామ్రాజ్యం విలువలో బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి తోడు ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల కారణంగా యాంట్ గ్రూప్ కు ఎదురుదెబ్బ తగిలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!

Stock Market: వడ్డీ రేట్ల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు.. 1307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..