Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!

Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని పేవాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనే తన ప్రణాళికలను వెల్లడించారు. దీంతో ఇకపై ట్విట్టర్ ఫీగా అందరికీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది.

Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!
Elon Musk
Follow us

|

Updated on: May 04, 2022 | 5:39 PM

Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని పేవాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనే తన ప్రణాళికలను వెల్లడించారు. దీంతో ఇకపై ట్విట్టర్ ఫీగా అందరికీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ కింద ట్విట్టర్ సేవల్లో అనేక మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, “సాధారణ వినియోగదారుల” కోసం ట్విట్టర్ ఎల్లప్పుడూ ఉచితమేనని మస్క్ స్పష్టం చేశారు. కానీ వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు ట్విట్టర్ వినియోగించుకుంటున్నందుకు స్వల్ప ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అత్యుత్తమైన సేవలను ఉచితంగా అందించటం వల్ల కంపెనీకి ఉపయోగం లేకుండా చేస్తున్నాయని.. అందువల్ల ట్విట్టర్ వినియోగించుకుంటున్నందుకు కొంత రుసుమును ప్రవేశ పెడుతున్నట్లు ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో అన్నారు.

Twitter ఫీ-ఆధారిత చందా ఆలోచనకు పూర్తిగా కొత్తది కాదని.. Twitter బ్లూ అనేది ఇదే విధమైన సేవ అన్నారు. Twitter బ్లూ అనేది అత్యంత విశ్వసనీయమైన కస్టమర్లకు ప్రీమియం ఫీచర్‌లకు, యాప్ కస్టమైజేషన్ చిన్న నెలవారీ సభ్యత్వ రుసుముతో అందుబాటులో ఉంది. US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వెబ్ కోసం Twitter బ్లూ iOS, Android, వెబ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ట్విటర్ బ్లూ తన చెల్లింపు కస్టమర్లకు ప్రత్యేకమైన ఫీచర్లను అందజేస్తుండగా.. వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారుల కోసం ప్రాథమిక ప్లాట్‌ఫారమ్ ఫీజు ఆధారితంగా ఉపయోగించడాన్ని మస్క్ సూచిస్తున్నారు. ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో ‘Maybe’ అనే పదాన్ని వినియోగించటం వల్ల ఈ ఆలోచన అమలుకు ఎంతవరకు కుదురుతుంది అనే దాని ప్రకారం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఒప్పందం చేసుకున్న తరుణంలో సోషల్ మీడియా దిగ్గజం భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ట్విట్టర్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వైపు మస్క్ ఉచిత ట్విట్టర్‌ సేవలను ముగించాలనుకుంటున్నట్లు అనిపిస్తోంది. కానీ మరోవైపు అతను ‘సముచిత’ ప్రేక్షకులకు మించి ట్విట్టర్ పరిధిని విస్తరించాలనుకుంటున్నారు. ట్విట్టర్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని అనుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని వార్షిక మెట్ గాలాలో గతంలో అన్నారు. దీనిలో ఎక్కువ మంది అమెరికన్లు పాల్గొనాలని, వీలైనంత విశ్వసనీయంగా ట్విట్టర్ సేవలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మస్క్ అన్నారు.

ఇవీ చదవండి..

Stock Market: వడ్డీ రేట్ల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు.. 1307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

RBI Governor: సామాన్యులకు షాకిచ్చిన ఆర్బీఐ.. వడ్డీరేట్లు భారీగా పెంపు.. ప్రియం కానున్న ఆ ధరలు..

Latest Articles
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు మస్ట్..!
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు మస్ట్..!
'ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..': యువరాజ్ సింగ్
'ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..': యువరాజ్ సింగ్
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..