Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Rate Hike: వడ్డీ రేట్లపై ఆర్బీఐ హఠాత్‌ నిర్ణయం.. సామాన్యులకు ఖరీదుగా మారనున్న రుణాలు..

RBI Rate Hike: ఆర్బీఐ సామాన్యులకు అకస్మాత్తుగా షాక్ ఇచ్చింది. రెండు నెలలకు ఒకసారి జరగాల్సిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షను నెలరోజులు తిరగకుండానే నిర్వహించింది.

RBI Rate Hike: వడ్డీ రేట్లపై ఆర్బీఐ హఠాత్‌ నిర్ణయం.. సామాన్యులకు ఖరీదుగా మారనున్న రుణాలు..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 04, 2022 | 4:31 PM

RBI Rate Hike: ఆర్బీఐ సామాన్యులకు అకస్మాత్తుగా షాక్ ఇచ్చింది. రెండు నెలలకు ఒకసారి జరగాల్సిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షను నెలరోజులు తిరగకుండానే నిర్వహించింది. అంతే కాకుండా ఈ సమీక్షా సమావేశంలో బ్యాంకుల వడ్డీ రేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించే రెపో రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తున్నా.. ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని ముందుగానే ఊహించారు. కొంతకాలంగా ఆర్బీఐ రెపో రేటును పెంచుతుందని వారు చెబుతూనే వస్తున్నారు. అయితే.. ఇంత అకస్మాత్తుగా వడ్డీ ధరల పెంపు నిర్ణయం వెలువడటం అందరినీ హతాశులను చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ రోజు నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో అత్యవసరంగా దవ్య పరపతి విధాన సమీక్షను ఈ రోజు నిర్వహించారు.  ఈ సమీక్షలో గవర్నర్ శక్తికాంత దాస్ అతి పెద్ద ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి,  బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 40 BPS పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపోరేటు 4.40 శాతానికి పెరిగింది.

ఏడాది తరువాత పెరిగిన కీలక వడ్డీ రేట్లు..

అమెరికా ఫెడరల్ రిజర్వ్.. కీలక బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచకముందే ఆర్బీఐ ఈ అనూహ్య చర్య తీసుకుంది. ఇది కాకుండా.. దేశంలో పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా RBI ఇటువంటి చర్య తీసుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. వడ్డీ రేట్లకు అధనంగా CRR లేదా క్యాష్ రిజర్వు రేషియోను 0.50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిష్పత్తి  4.5 శాతానికి పెరిగింది. అంతకుముందు.. RBI చివరిసారిగా కీలక వడ్డీ రేట్లను గత సంవత్సరం మే 22న మార్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రకటించటంతో బెంచ్ మార్కె ఇండెక్స్ సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. నిర్ణయం వెలువడిన వెంటనే సెన్సెక్స్ 1100 పాయింట్లను కోల్పోయింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణం నియంత్రణపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ నిర్ణయం ద్వారా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో పక్క అమెరికా ఫెడ్ కూడా అతి త్వరలోనే కీలక వడ్డీ రేట్లకు పెంచవచ్చని తెలుస్తోంది.

రెపో రేటు అంటే ఏంటి?

ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు రుణాలు తీసుకుంటుంటాయి. అలా బ్యాంకుల తీసుకున్న లోన్లపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అని అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని సైతం పిలుస్తుంటారు. దీని పెంపు వల్ల బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అందించి పర్సనల్, వాణిజ్య, హోమ్ లోన్స్ వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. అదే విధంగా రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. రెపోరేటు మార్పు వల్ల లోన్స్ పొందటం మరింత ప్రియంగా లేదా చౌకగా మారతాయి.

రివర్స్ రెపో రేటు అంటే ఏంటి ?

బ్యాంకులు తమ  డబ్బును రిజర్వ్ బ్యాంకులో దాచుకుంటుంటాయి. ఇలా బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే డబ్బును రుణంగా భావిస్తుంది. ఈ డబ్బుపై బ్యాంకులు తీసుకునే వడ్డీని రివర్స్ రెపో రేటు అని అంటారు. ఈ రేటు ఎప్పుడూ రెపో రేటు కంటే తక్కువగానే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం బ్యాంకులు తమ డబ్బును రిజర్వు బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

You Tube: యూట్యూబ్ యాడ్స్ తో విసిగిపోయారా.. ఇలా చేస్తే ఆ బాధే ఉండదు

RBI Governor: సామాన్యులకు షాకిచ్చిన ఆర్బీఐ.. వడ్డీరేట్లు భారీగా పెంపు.. ప్రియం కానున్న ఆ ధరలు..