Hyderabad: మీ కాలనీలో కరెంట్ కట్ అయిందా.. ఈ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి
హైదరాబాద్ మహనగరంలో ఈ తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం.. పెను బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులతో నగరవాసులకు వణికించింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలపై...
హైదరాబాద్ మహనగరంలో ఈ తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం.. పెను బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులతో నగరవాసులకు వణికించింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరుతున్నారు. రోడ్లపై మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ తీగలు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి వెళ్లకూడదని కోరుతున్నారు. విద్యుత్ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రహదారులపై వరద పొంగిపొర్లింది. కుండపోత వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Picture Puzzle: ఇది కదా సరైన పజిల్ అంటే.. మాములు కన్‌ఫ్యూజన్ కాదు.. పిల్లిని కనిపెట్టండి చూద్దాం