Picture Puzzle: ఇది కదా సరైన పజిల్ అంటే.. మాములు కన్‌ఫ్యూజన్ కాదు.. పిల్లిని కనిపెట్టండి చూద్దాం
Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన పజిల్.
Trending Photo: మెదడకు మేత పెట్టే పదాలకు సంబంధించి పజిల్స్ గురించి అందరికీ తెలుసు. కానీ ఫోటో పజిల్స్ గురించి మీకు తెలుసా..? ఇప్పుడు ఇవే ట్రెండింగ్ అండీ బాబూ..! అవును.. ఇవి నెటిజన్లను బాగా అట్రాక్ చేస్తున్నాయి. ఈ ఫోటో పజిల్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్నింటిలో దాగి ఉన్న జంతువును లేదా పక్షిని గుర్తించాలి. ఇంకో రకం ఏంటంటే.. ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో సరిగ్గా కనిపెట్టాలి. ఇలా రకరకాలు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో జనాలకు ఈ పజిల్స్ తారసపడుతున్నాయి. ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే ఐ పవర్ అద్భుతంగా ఉండాలి. అప్పుడే వాటిని సులభంగా సాల్వ్ చేసేయగలం. అలా ఓ చేస్తే ఓ చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కాగా ఫోటో పజిల్స్‌కు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. ఇక ఈ కోవలో తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..
పైన ఇచ్చిన ఫోటోలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే అది మీ వైపే చూస్తుంది. అదేలెండీ.. ఫోటో తీసేటప్పుడు కెమెరా వైపు చూస్తుంది. ఈ ఫోటోలో ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టాలని చాలామంది నెటిజన్లు ప్రయత్నించారు. కానీ చాలామంది విఫలమయ్యారు. మరి మీ కళ్లలో పదునుందో లేదో ఓ సారి టెస్ట్ చేసి చూడండి. కొన్ని సెకన్లలోనే ఆ పిల్లిని కనిపెడితే మీరు తోపే.! సమాధానం దొరక్కపోతే దిగువన ఫోటోను చూడండి.