Hyderabad: రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. వ్యక్తి కడుపులో రూ.11కోట్లు విలువైన డ్రగ్స్
హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధ్రిల్లర్ చిత్రం వీడొక్కడే. ఈ చిత్రంలో మాదకద్రవ్యాలను ఎలా స్మగ్లింగ్ చేస్తారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదే సినిమాలో ఓ వ్యక్తి.. డ్రగ్ గోలీలను మింగి.. ఇతర ప్రాంతాలకు అక్రమ...
హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధ్రిల్లర్ చిత్రం వీడొక్కడే. ఈ చిత్రంలో మాదకద్రవ్యాలను ఎలా స్మగ్లింగ్ చేస్తారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదే సినిమాలో ఓ వ్యక్తి.. డ్రగ్ గోలీలను మింగి.. ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి కడుపులో డ్రగ్స్ ను గుర్తించిన అధికారులు.. శస్త్రచికిత్స చేసి రూ.11కోట్లు విలువైన మత్తుపదార్థాలను వెలికితీశారు. టాంజానియా దేశానికి చెందిన ఓ యువకుడు.. గత నేల 26న జోహన్నెస్‌బర్గ్ నుంచి శంషాబాద్ వచ్చాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వెంట తెచ్చకున్న లగేజీని తనిఖీ చేశారు. అతని వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదని నిర్ధారించి వదిలేశారు. అయితే అతని నడవడిలో తేడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు తమదైన శైలిలో విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేసేందుకు తాను హెరాయిన్ మాత్రలను మింగానని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు.
వెంటనే అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శస్త్రచికిత్స చేసి, టేప్ చుట్టిన డ్రగ్ ట్యాబెట్లను కడుపు నుంచి బయటికి తీశారు. మొత్తం 108 మాత్రలను వెలికితీసిన అధికారులు వాటి బరువు 1,389 గ్రాములు ఉన్నట్లు తేల్చారు. వీటి విలువ సమార.11.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. సదరు యువకుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి