AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను ఎప్పుడూ దానం చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

Astro Tips: హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు.

Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను ఎప్పుడూ దానం చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!
Astro Tips
Shiva Prajapati
|

Updated on: May 04, 2022 | 5:25 PM

Share

Astro Tips: హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు. దానం చేయడం ముక్తి మార్గమని భావిస్తారు. ప్రజలు అనేక ప్రత్యేక సందర్భాలలో వస్తువులను దానం చేయడానికి కారణం ఇదే. సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదలకు దానం చేస్తే పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. అయితే, మత గ్రంథాలలో దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటిస్తూ మాత్రమే దానం చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది. అలాకాకుండా ఇష్టారీతిన సమయం, సందర్భం లేకుండా చేస్తే కుటుంబానికి చేటు కలుగుతుంది. మత గ్రంధాల్లోన్ని వివరాల ప్రకారం.. సూర్యాస్తమం తరువాత కొన్ని వస్తువులను దానం చేయడం నిషిద్ధంగా పేర్కొంటారు. సూర్యాస్తమయం తరువాత వాటిని దానం చేయడం అశుభంగా పేర్కొంటారు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. మరి సూర్యాస్తమయం తరువాత ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం..

తులసి మొక్క..

సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను దానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసిని తాకడం కూడా నిషిద్ధం. ఈ సమయంలో తులసి చెట్టుకు నీరు కూడా పోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఈ మొక్కను దానం చేయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుందని విశ్వాసం. ఇది ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఆర్థికపరమైన కష్టాలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

డబ్బు దానం..

సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మత గ్రంధాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అటువంటి సమయంలో డబ్బును దానం చేయడం ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుచేత సూర్యాస్తమయం తర్వాత ధనాన్ని దానం చేయకండి. ఉదయాన్నే దానం చేయడం ద్వారా ఎలాంటి సమస్యా ఉండదు.

పసుపును దానం చేయవద్దు..

పసుపును హిందూమతంలో అనేక శుభకార్యాలకు ఉపయోగిస్తారు. ఇది బృహస్పతి గ్రహం కారకంగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికీ దానం చేయకూడదు. ఇది బృహస్పతి గ్రహాన్ని బలహీనపరుస్తుందని మత గ్రంధాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

పాలు దానం చేయవద్దు..

శాస్త్రాలలో పాలను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. ఇది చంద్రుని కారకంగా పరిగణించబడుతుంది. సోమ, శుక్రవారాల్లో పాలు దానం చేయవచ్చు. కానీ సూర్యాస్తమయం తర్వాత పాలు ఎప్పుడూ దానం చేయకూడదు. ఇది లక్ష్మీదేవికి, విష్ణువుకి కోపం తెప్పింస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు.

పెరుగు దానం చేయవద్దు..

పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించినది. శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని విశ్వసిస్తారు. సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం అశుభం. ఇది శుక్రుడికి కోపం తెప్పిస్తుంది. ఆనందం, శ్రేయస్సులో తగ్గుదల ఉండవచ్చు. అందువల్ల, పెరుగును ఎవరి దగ్గర నుండి తీసుకోవద్దు లేదా సాయంత్రం ఎవరికైనా ఇవ్వవద్దు.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!