Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri: వెనక్కు తగ్గిన అధికారులు.. పార్కింగ్ ఫీజుల నుంచి భక్తులకు ఊరట

యాదాద్రి(Yadadri) మహాలయ పునరుద్ఘాటన తర్వాత క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. ఈ మధ్యే కొండపైకి వాహనాలకు అనుమతి ఇచ్చారు. కొండపైకి...

Yadadri: వెనక్కు తగ్గిన అధికారులు.. పార్కింగ్ ఫీజుల నుంచి భక్తులకు ఊరట
Yadadri Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 04, 2022 | 7:34 PM

యాదాద్రి(Yadadri) మహాలయ పునరుద్ఘాటన తర్వాత క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. ఈ మధ్యే కొండపైకి వాహనాలకు అనుమతి ఇచ్చారు. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్(Parking) ఫీజు రూ.500గా నిర్ణయించారు. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ అధికారుల పార్కింగ్ ఫీజుల నిర్ణయంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదురైంది. దీంతో దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు చేసింది. నిర్దేశిత సమయాని కంటే అదనంగా ప్రతి గంటకు రూ.100 చొప్పున విధిస్తున్న రుసుమును ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండపైకి వెళ్లే ఫోర్ వీలర్స్ వెహికిల్స్ పార్కింగ్ ఫీజు రూ.500 ఉన్న విషయం తెలిసిందే. ఆలయ అధికారుల నిర్ణయంతో భక్తులకు కాస్త ఊరట కలగనుంది.

వాహనాల పార్కింగ్ ధరలు భారీగా విధించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులను పార్కింగ్ పేరుతో నిలువుదోపిడీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పున:‌ప్రారంభమైన యాదాద్రి ఆలయానికి ఇటీవల భక్తుల తాకిడి పెరిగింది. ఈ కోవలోనే కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే సొంత వాహనాల్లో నేరుగా కొండపైకి వెళ్లాలనుకునే వారికోసం అనుమతి ఇచ్చిన అధికారులు పార్కింగ్ ఫీజు మాత్రం కళ్లుచెదిరేలా నిర్ణయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Jack Ma: చైనా వ్యాపారవేత్త ‘జాక్ మా’ అరెస్ట్? కుప్పకూలిన అలీబాబా కంపెనీ షేర్లు.. పూర్తి వివరాలు

సిలిండర్లు పంపిణీ చేస్తూ.. కొడుకు కెరీర్‌ కోసం కష్టపడిన తండ్రి.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో హీరోగా మారిన ప్లేయర్.. ఎవరంటే?