SS Rajamouli : మాస్ పాత్ర‌లోకి ఈజీగా షిప్ట్ అయిపోతాడు.. శ్రీవిష్ణు పై ఆసక్తికర కామెంట్స్ చేసిన జక్కన్న

శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన నటనతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు శ్రీవిష్ణు.

SS Rajamouli : మాస్ పాత్ర‌లోకి ఈజీగా షిప్ట్ అయిపోతాడు.. శ్రీవిష్ణు పై ఆసక్తికర కామెంట్స్ చేసిన జక్కన్న
Sree Vishnu Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2022 | 6:23 PM

శ్రీవిష్ణు(Sree Vishnu )కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన నటనతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్ హీరో మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన తాజా చిత్రం భళా తందనాన(Bhala Thandanana). వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించారు. మే 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మం రీసెంట్ హైద‌రాబాద్‌ లోని జె.ఆర్‌సి. క‌న్‌వెన్‌ష‌న్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథులుగా ద‌ర్శ‌కులు రాజ‌మౌళి(SS Rajamouli), శేఖ‌ర్ క‌మ్ముల హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిగ్ టికెట్‌ ను వారిరువురూ ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ..చైత‌న్య బాణం సినిమా చూసిన‌ప్పుడు మొద‌ట ఎవ‌రైనా చిన్న సినిమాగా తీస్తారు. త‌ను మాత్రం పెద్ద సినిమా తీశాన‌నే యాటిట్యూడ్ క‌నిపించేలా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే చేశాడు. ప్ర‌తి మూమెంట్‌లోనూ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే స‌స్పెన్స్ క్రియేట్ చేశాడు. స‌స్పెన్స్ రివీల్ చేస్తున్న‌ప్పుడు హైగా వుండేలా చూసుకున్నాడు అన్నారు రాజమౌళి. అలాగే శ్రీ‌విష్ణు ప‌క్కింటి కుర్రాడిలా వుంటాడు. చేప నీటిలోకి ఈజీగా వెళ్ళిన‌ట్లు త‌ను కూడా మాస్ పాత్ర‌లోకి షిప్ట్ అయిపోతాడు. సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు ఎలా వుంటాడో చివ‌రిలోనూ అలానే వుంటాడు. తెలుగులో త‌న‌కంటూ ఒక జోన‌ర్‌ ను క్రియేట్ చేసుకున్నాడు. మంచి క‌థ‌ను ఎంపిక చేసుకున్నాడు. ఫ్యూచ‌ర్ బ్రైట్‌గా క‌నిపిస్తున్న హీరోల్లో ఒక‌డు. క్యాథ‌రిన్‌ కు మంచి పాత్ర రాశారు. ఇద్ద‌రి జంట బాగుంది. ల‌వ్ స్టోరీ కాకుండా ఇన్‌వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా స్ట్రాంగ్ పాత్రలో ఆమెను చూపారు. సాయికొర్ర‌పాటిగారు మొద‌టి నుంచి సినిమాపై పూర్తి న‌మ్మ‌కంగా వున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌., కేజీఎఫ్2 రిలీజ్‌ కు ముందు ఈ సినిమా గురించే టాపిక్ వ‌చ్చేది. భ‌ళా తందనాన బాగుంద‌ని చెప్పేవారు. ఆయ‌న చేసిన 7,8 సినిమాల్లో మంచి కాన్‌ఫిడెన్స్ క‌నిపించింది. అందుకే ఓటీటీలో మంచి ఆఫ‌ర్ వున్నా థియేట‌ర్‌ లోనే విడుద‌ల చేస్తున్నారు. సాయిగారు ఏ సినిమా అయినా టెక్నిక‌ల్‌ గా బాగుండాల‌ని కోరుకుంటారు. సౌండ్ డిజైన్ బాగుంది. భ‌ళా తంద‌నాన బిగ్ హిట్ అవుతుంది. మే 6న థియేట‌ర్‌లో చూడండి అని జక్కన్న చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..