AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిలిండర్లు పంపిణీ చేస్తూ.. కొడుకు కెరీర్‌ కోసం కష్టపడిన తండ్రి.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో హీరోగా మారిన ప్లేయర్.. ఎవరంటే?

ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మ్యాచ్‌లో ఓ ప్లేయర్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యంగ్ ప్లేయర్..

సిలిండర్లు పంపిణీ చేస్తూ.. కొడుకు కెరీర్‌ కోసం కష్టపడిన తండ్రి.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో హీరోగా మారిన ప్లేయర్.. ఎవరంటే?
Rinku Singh
Venkata Chari
|

Updated on: May 04, 2022 | 6:20 PM

Share

ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మ్యాచ్‌లో ఓ ప్లేయర్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యంగ్ ప్లేయర్.. చాలా మందికి తెలియకపోయినా.. ఎక్కువుగా చర్చ జరుగుతోంది. ఆయనే రింకూ సింగ్ (Rinku Singh). రింకూ అలీఘర్ నివాసి. ఈరోజు దేశం మొత్తం రింకూ అంటే ఎవరా అని తెగ వెతుకుతున్నారు. అయితే, రింకూని ఈ స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన తండ్రితోపాటు కుటుంబం మొత్తం ఎంత కష్టపడ్డారో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రింకూ తండ్రి సైకిల్‌పై, భుజంపై సిలిండర్‌ పెట్టుకుని ఎండ, వానలు చూడకుండా ఇంటింటికీ గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేసేవాడు. తండ్రి కఠోర శ్రమ, రింకూ కష్టాల ఫలితమే నేడు ఐపీఎల్‌ కేకేఆర్‌ టీమ్‌లో హీరోగా ఎదిగేందుకు దోహదపడింది.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకు 23 బంతుల్లో 42 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్‌ని ఆడి కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ యంగ్ ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత, రింకూ సింగ్ తుఫాన్ బ్యాటింగ్‌తో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ ఆల్ రౌండర్ క్రికెటర్ తన బ్యాటింగ్ తోనే కాకుండా తన అద్భుతమైన ఫీల్డింగ్ తో కూడా టీమ్ మేనేజ్ మెంట్, ఆటగాళ్ల హృదయాలను గెలుచుకున్నాడు.

అలీగఢ్‌ నుంచి ఐపీఎల్‌ వరకు రింకూ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. రింకూ సింగ్ ఓ చిన్న పట్టణం నుంచి ఐపీఎల్‌కి వచ్చాడు. అతను గత 5 సంవత్సరాలుగా క్రికెట్‌లోని ఎత్తుపల్లాలను నిరంతరం టచ్ చేస్తున్నాడు. అయితే రింకు ఐపీఎల్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలవడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఇక రింకూ గురించి చెప్పాలంటే పేద కుటుంబం నుంచి వచ్చాడు. రింకూ కుటుంబం ప్రయాణం పోరాటంతో నిండి ఉంది. రింకూ తండ్రి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, తల్లి గృహిణి.

ఇవి కూడా చదవండి

రింకూ చదువుకునే సమయంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాడు. రింకూకి 5 మంది తోబుట్టువులు. ఇందులో రింకూ మూడోవాడు. అదే సమయంలో రాయల్ రాజస్థాన్‌పై రింకూ చారిత్రాత్మక విజయం నమోదు చేయడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈమేరకు రింకూ తండ్రి ఖాంచంద్ మాట్లాడుతూ, ఒకప్పుడు రింకూ చదువుకు డబ్బు ఉండేది కాదు. మొదటి నుంచి రింకూకు చదువు ఇష్టం లేదని, చదువుకునే సమయంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాడినని చెప్పాడు. అలా అనడంతో మా కుటుంబం సంతోషంగా లేదు. కానీ, ప్రస్తుతం మావాడి ప్రదర్శనతో అంతా సంతోషంగా ఉన్నాం” అని తెలిపారు.

స్టేడియానికి వెళ్లేందుకు బైక్‌ కొనిచ్చిన తండ్రి..

అయితే రింకూ పట్టుదల చూసి కుటుంబ సభ్యులు ఆయనను అడ్డుకోవడం మానేశారు. ఆ తర్వాత రింకూ క్రికెట్‌పై తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నాడు. 2008లో డీపీఎస్‌లో జరిగిన టోర్నీలో రింకూ మంచి ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో, DPS లో జరిగిన టోర్నమెంట్ తర్వాత, రింకూ తండ్రి ఖాంచంద్ కూడా స్టేడియానికి వెళ్లడానికి రింకూకి ఒక మోటార్ సైకిల్ అందించాడు. ఆ సమయంలో కొడుకు కోసం చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని, ఈరోజు రింకూ అలీగఢ్‌తో సహా దేశ విదేశాల్లో తన కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడని’ తెలిపాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: విరాట్ సరసన సీఎస్కే సారథి.. కేవలం 6 అడుగుల దూరమే.. ఆ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?

IPL 2022: గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడిన రూ. 11 కోట్ల పంజాబ్ ప్లేయర్.. భారీ సిక్సర్లతో ఊచకోత.. స్పెషల్ రికార్డు కూడా..