కేవలం 8 మ్యాచ్‌లు.. 950 పరుగులు, 44 వికెట్లతో హల్‌చల్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ప్లేయర్.. ఎవరంటే?
ఈ ఏడాది బీసీసీఐ అండర్ 19 ప్రపంచ కప్ (ICC U19 World Cup) కోసం జట్టును ప్రకటించినప్పుడు, హర్యానాకు చెందిన మయాంక్ శాండిల్యా(Mayank Shandilya) ఎంతో ఆవేదన చెందాడు. తన స్నేహితులు.
ఈ ఏడాది బీసీసీఐ అండర్ 19 ప్రపంచ కప్ (ICC U19 World Cup) కోసం జట్టును ప్రకటించినప్పుడు, హర్యానాకు చెందిన మయాంక్ శాండిల్యా(Mayank Shandilya) ఎంతో ఆవేదన చెందాడు. తన స్నేహితులు దినేష్ బానా(Dinesh Bana) , నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్‌ల ఎంపిక పట్ల ఈ ప్లేయర్ సంతోషించాడు. కానీ, ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో అతను చాలా నిరాశ చెందాడు. అయితే, ఈ నిరాశ అతనికి మెరుగైన ఆటగాడిగా మారడానికి ప్రేరణనిచ్చింది. దాని ప్రభావం కూచ్ బెహార్ ట్రోఫీలో కనిపించింది. మయాంక్ ఇక్కడ ఆల్ రౌండ్ గేమ్‌తో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యపరిచాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతాలు చేసి, సెలక్టర్ల చూపు ఆకర్షించాడు.
కూచ్ బెహార్ ట్రోఫీలో హర్యానా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి, హీరోగా మారిన మయాంక్.. అటు బ్యాట్‌తో, ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ 18 ఏళ్ల ఆల్ రౌండర్, తన ఆట ఆధారంగా బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకున్నాడు.
8 మ్యాచ్‌ల్లో 950 పరుగులు, 44 వికెట్లు..
కూచ్ బెహార్ ట్రోఫీలో మయాంక్ 8 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో సహా 950 పరుగులు చేశాడు. బెంగాల్‌పై 224 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు. ఇది కాకుండా, మయాంక్ 44 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో అతను 8 సార్లు ఐదు వికెట్లు తీయగలిగాడు. అతని ప్రదర్శన ఆధారంగా హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో విజయం సాధించింది. అండర్-19 ప్రపంచకప్ సమయంలో, అతనిని పట్టించుకోని వారికి.. తన ఆటతో సమాధానం ఇచ్చాడు. మయాంక్ హర్యానాలోని శ్రీ రామ్ నరేన్ క్రికెట్ క్లబ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతని కోచ్ అశ్విని కుమార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ‘అండర్-19 ప్రపంచకప్‌లో మయాంక్ ఎంపిక కాలేదు. ఇది అతన్ని మెరుగైన ఆటగాడిగా మార్చింది’ అని తెలిపాడు.
జయంత్ యాదవ్ సలహాతో..
మయాంక్ అండర్-16 వరకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడేవాడు. అయినప్పటికీ అతను పార్ట్ టైమ్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆల్ రౌండర్ పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో మయాంక్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఈ సమయంలో, అతను హిమాచల్ తరపున 36, 49 పరుగుల తొలి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక్కడే అతను భారత్ తరపున టెస్టు ఆడిన జయంత్ యాదవ్‌ను కలిశాడు. మయాంక్ యాక్షన్ అద్భుతంగా ఉందని, బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని జయంత్ సూచించాడు. దీని తరువాత, అతను ప్రతిరోజూ 200 బంతులు వేయడం ప్రారంభించాడు. ఆ ప్రభావం కూడా కనిపించింది. కూచ్ బెహార్‌లో దీని ప్రయోజనం పొందానని మయాంక్ చెప్పుకొచ్చాడు. మరింత ఆత్మవిశ్వాసంతో టోర్నీలోకి అడుగుపెట్టాడు. లీగ్ రౌండ్‌లో ముంబై ఓడిపోవడంతో ఫైనల్‌లో ముంబైని ఓడించగలిగానని మయాంక్ సంతోషం వ్యక్తం చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Wriddhiman Saha: సాహా ఇష్యూలో భారీ షాకిచ్చిన బీసీసీఐ.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం..
IPL 2022: విరాట్ సరసన సీఎస్కే సారథి.. కేవలం 6 అడుగుల దూరమే.. ఆ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?