IPL 2022: విరాట్ సరసన సీఎస్కే సారథి.. కేవలం 6 అడుగుల దూరమే.. ఆ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?

T20 Records: టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6000 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా మారేందుకు మహేంద్ర సింగ్ ధోని కేవలం 6 పరుగుల దూరంలో నిలిచాడు.

IPL 2022: విరాట్ సరసన సీఎస్కే సారథి.. కేవలం 6 అడుగుల దూరమే.. ఆ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?
Ipl 2022 Csk Vs Kkr Dhoni
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 6:26 PM

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కమాండ్ మరోసారి ఎంఎస్ ధోని(Dhoni) చేతుల్లోకి వచ్చింది. సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడంతో మళ్లీ ధోనీ ఈ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా పునరాగమనం చేసిన ధోనీ.. ఈ పాత బాధ్యతతో రానున్న మ్యాచ్‌ల్లో భారీ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 6000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం ధోనీ 301 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌ల్లో 185 ఇన్నింగ్స్‌ల్లో ధోనీ మొత్తం 5994 పరుగులు చేశాడు. 6000 పరుగులకు కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు. IPL 2022లో జరగబోయే మ్యాచ్‌లలో ధోనీ 6 పరుగులు చేస్తే, అతను కెప్టెన్‌గా T20 క్రికెట్‌లో 6000 పరుగులు చేసిన రెండవ ఆటగాడు అవుతాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ స్థానాన్ని సాధించాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 190 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 185 ఇన్నింగ్స్‌ల్లో 43.29 సగటుతో 6451 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ నిలిచాడు. టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా బ్యాటింగ్ చేస్తూ విరాట్ 5 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరోవైపు కెప్టెన్‌గా ధోనీ 38.67 సగటుతో పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ 23 అర్ధ సెంచరీలు చేశాడు.

నేడు CSK టీం RCBతో పోటీపడుతోంది. RCB 10 మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా, చెన్నై జట్టు 9 మ్యాచ్‌లలో 3 గెలిచి తొమ్మిదో స్థానంలో ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే చెన్నై ప్రస్తుతం మిగిలిన 5 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలవాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడిన రూ. 11 కోట్ల పంజాబ్ ప్లేయర్.. భారీ సిక్సర్లతో ఊచకోత.. స్పెషల్ రికార్డు కూడా..

IPL 2022: లివింగ్‌స్టోన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఒకే ఓవర్‌లో 6,6,6,4,2,4తో రెచ్చిపోయిన పంజాబ్‌ ఆటగాడు..