IPL 2022: లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్.. ఒకే ఓవర్‌లో 6,6,6,4,2,4తో రెచ్చిపోయిన పంజాబ్ ఆటగాడు..
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్(Livingstone) తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో స్టేడియాన్ని ఓరెత్తించాడు.
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్(Livingstone) తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో స్టేడియాన్ని ఓరెత్తించాడు. భారీ సిక్స్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6,6,6,4,2,4 పరుగులతో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. లివింగ్‌స్టోన్ మొదటి బంతికే ఆ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి మళ్లీ సిక్స్, మూడో బంతి మరో సిక్స్ కొట్టి హ్యట్రిక్ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచిపోయాడు. నాలుగో బంతి ఫోర్, ఐదో బంతికి రెండు పరుగులు చేయగా ఆరో బంతికి ఫోర్ కొట్టాడు లివింగ్‌స్టోన్. ఈ మెరుపు ఇన్సింగ్స్‌ను డగౌట్‌లో కూర్చున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కూడా ఆశ్చర్యపరిచాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 16 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ 53 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భానుక రాజపక్స 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. లింగ్‌స్టోన్ 10 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 16వ ఓవర్లలో పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ విశ్వరూపం ప్రదర్శించాడు. అంతకుముందు పంజాబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల గుజరాత్ స్పల్ప స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటరిపోరు చేయడం వల్ల గుజరాత్ 143 పరుగులు చేయగలిగింది.
Read Also.. సేమ్ టు సేమ్.. ఒకే స్టైల్ గడ్డంతో అదరగొడుతోన్న ప్రధాని మోదీ.. విరాట్ కోహ్లీ..