RCB vs CSK Highlights: రాణించిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నైపై 13 పరుగుల తేడాతో విజయం..

Venkata Chari

| Edited By: Srinivas Chekkilla

Updated on: May 05, 2022 | 12:06 AM

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.

RCB vs CSK Highlights: రాణించిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నైపై 13 పరుగుల తేడాతో విజయం..
Rcb Vs Csk Live Score

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై(CSK), బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ధోనీ సేన ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 May 2022 10:59 PM (IST)

    చెన్నైపై ఆర్సీబీ ఘన విజయం

    చెన్నై సూపర్‌ కింగ్స్‌పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.

  • 04 May 2022 10:56 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన చెన్నై

    చెన్నై సూపర్‌ కింగ్స్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది.

  • 04 May 2022 10:53 PM (IST)

    ఎంఎస్‌ ధోని ఔట్‌..

    చెనై సూపర్ కింగ్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. ఎంఎస్‌ ధోని క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 04 May 2022 10:43 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన చెన్నై

    చెన్నై సూపర్‌ కింగ్స్ ఆరో వికెట్‌  కోల్పోయింది. మొయిన్‌ అలీ ఔటయ్యాడు.

  • 04 May 2022 10:34 PM (IST)

    జడేజా ఔట్‌..

    చెన్నై సూపర్ కింగ్స్ ఐదో వికెట్‌ కోల్పోయింది. జడేజా కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు.

  • 04 May 2022 10:26 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై

    చెన్నై సూపర్‌ కింగ్స్ నాలుగో వికెట్‌ కోల్పోయింది.  కాన్వే ఔటయ్యాడు.

  • 04 May 2022 10:08 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన చెన్నై

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అంబటి రాయుడు బౌల్డ్‌ అయ్యాడు.

  • 04 May 2022 09:58 PM (IST)

    8 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్..

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించింది. డేవాన్ కాన్వే 31, రాయుడు 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 04 May 2022 09:35 PM (IST)

    మూడు ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్..

    మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు సాధించింది. డేవాన్ కాన్వే 14, రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 04 May 2022 09:05 PM (IST)

    చెన్నై టార్గెట్ 174..

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 176 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బెంగళూర్ టీంలో మహిఫాల్ లామ్రోర్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

  • 04 May 2022 08:53 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    హసరంగా (0) రూపంలో బెంగళూర్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 18.2 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఇదే ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోయింది.

  • 04 May 2022 08:51 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    లామ్రోర్ (42 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రూపంలో బెంగళూర్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 18.1 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

  • 04 May 2022 08:33 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    రజత్ పాటిదార్ (21 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో బెంగళూర్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 15.1 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.

  • 04 May 2022 08:28 PM (IST)

    14 ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    14 ఓవర్లు పూర్తయ్యే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం 3 వికెట్లు కోల్పోయి 110 పరుగులు పూర్తి చేసింది. రజత్ 15, లామ్రోర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 04 May 2022 08:15 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    విరాట్ కోహ్లీ (30 పరుగులు, 33 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో బెంగళూర్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. అలీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం మూడు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది.

  • 04 May 2022 08:10 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    మాక్స్‌వెల్ (3) రూపంలో బెంగళూర్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

  • 04 May 2022 08:05 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన బెంగళూర్..

    డుప్లెసిస్ (38 పరుగులు,14 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో బెంగళూర్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. అలీ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ టీం ఒక వికెట్ కోల్పోయి 66 పరుగులు చేసింది. విరాట్ 24, మాక్స్‌వెల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 04 May 2022 07:54 PM (IST)

    ఐదు ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 51 పరుగులు పూర్తి చేసింది. విరాట్ 17(16 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్), డుప్లిసిస్ 32(14 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 04 May 2022 07:45 PM (IST)

    మూడు ఓవర్లకు బెంగళూర్ స్కోర్..

    మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 20 పరుగులు పూర్తి చేసింది. విరాట్ 11, డుప్లిసిస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 04 May 2022 07:08 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

  • 04 May 2022 07:08 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు..

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

  • 04 May 2022 07:05 PM (IST)

    Bangalore vs Chennai, LIVE Score: టాస్ గెలిచిన ధోనీ.. తొలుత బ్యాటింగ్ చేయనున్న బెంగళూర్

    చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు గెలిచేందుకు హోరీహోరీగా తలపడనున్నాయి.

  • 04 May 2022 07:03 PM (IST)

    Bangalore vs Chennai, LIVE Score: RCB హ్యాట్రిక్ ఓటమితో బరిలోకి..

    RCB తొమ్మిది మ్యాచ్‌లలో పది పాయింట్లు కలిగి, ఐదో స్థానంలో ఉంది. ఇందులో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. RCB సీజన్‌లో అత్యల్ప స్కోరు 68 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో 145 పరుగుల సులభమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

Published On - May 04,2022 6:59 PM

Follow us