CSK Vs RCB: చెన్నైపై 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం.. రాణించిన లామ్రోర్‌, డుప్లెసిస్‌..

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై(CSK), బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ..

CSK Vs RCB: చెన్నైపై 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం.. రాణించిన లామ్రోర్‌, డుప్లెసిస్‌..
Rcb
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 05, 2022 | 12:03 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై(CSK), బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ధోనీ సేన ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 122 పరుగుల వరకు చెన్నై ఇన్నింగ్స్‌ నిలకడగానే సాగినప్పటికీ అనంతరం స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు పడ్డాయి. దీంతో ఆజట్టుపై ఒత్తిడి పెరిగిపోయి చేతులత్తేసింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌ సేన 6 మ్యాచుల్లో నెగ్గింది.

ఇక మిగతా మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. చెన్నై జట్టులో డెవాన్‌ కాన్వే56, మొయిన్‌ అలీ 34 పరుగులతో రాణించారు. బెంగళూరు జట్టులో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీయగా, మాక్స్‌వెల్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంతుకు ముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల్ కోల్పోయి 173 పరుగులు చేశాడు. కెప్టెన్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ 38, విరాట్ కోహ్లీ 30, మహిపాల్‌ లామ్రోర్‌ 42, రజత్‌ పటిదార్‌ 21 పరుగులు చేశారు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌ మెరుపులతో డుప్లెసిస్‌ సేన 173 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ 3, పెట్రోయిస్ 2 వికెట్లు పడగొట్టగా.. ముకేష్ చౌదరి, సిమార్‌జిత్‌ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read Also.. సిలిండర్లు పంపిణీ చేస్తూ.. కొడుకు కెరీర్‌ కోసం కష్టపడిన తండ్రి.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో హీరోగా మారిన ప్లేయర్.. ఎవరంటే?