Morning Astro Tips: మంచి జరగాలని భావించేవారు ఉదయాన్నే మర్చిపోయి కూడా ఈ పని చేయకూడదు..!

Morning Astro Tips: సనాతన సంప్రదాయంలో మంచిని, అదృష్టాన్ని పొందడానికి అనేక నివారణలు పేర్కొనడం జరిగింది. ఇందులో ఉదయాన్నే లేవడం

Morning Astro Tips: మంచి జరగాలని భావించేవారు ఉదయాన్నే మర్చిపోయి కూడా ఈ పని చేయకూడదు..!
Morning Astro Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2022 | 6:20 AM

Morning Astro Tips: సనాతన సంప్రదాయంలో మంచిని, అదృష్టాన్ని పొందడానికి అనేక నివారణలు పేర్కొనడం జరిగింది. ఇందులో ఉదయాన్నే లేవడం నుండి అనేక అలవాట్లు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కోరుకున్న విజయం, ఆనందం, శ్రేయస్సును పొందుతారు. దీంతో పాటు.. ఉదయాన్నే చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఉదయాన్నే తెలిసిన, అనుకోకుండా చేసే తప్పుల వల్ల ఆ రోజుంతా దుష్ప్రభావం పడుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు బదులుగా.. దుఃఖం, దురుదృషటం ఎదరువుతాయి. మరి ఉదయాన్నే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం..

సనాతన సంప్రదాయం ప్రకారం.. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయం సాధించాలంటే మొదట మీరు సూర్యోదయానికి ముందు ఉదయం లేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదు. సూర్యోదయానికి ముందు ఆలస్యంగా నిద్రించే వారి వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మి దేవి చికాకుపడుతుందని, జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్వాసం.

కొన్నిసార్లు కొంతమంది ఉదయాన్నే నిద్రలేచి మళ్లీ నిద్రపోతుంటారు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. అలాంటి పరిస్థితుల్లో ఉదయం లేచిన తర్వాత మళ్లీ నిద్రపోవడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

కొందరికి ఉదయం నిద్ర లేవగానే అద్దం ముందు ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. మీకు అదే అలవాటు ఉంటే, మీ అలవాటును వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇది అస్సలు శ్రేయస్కరం కాదు. మీ మంచం ముందు అద్దం లేదా టీవీ స్క్రీన్ ఉంటే, మీరు ఉదయాన్నే దానిలో మీ ప్రతిబింబాన్ని చూడకూడదు.

ఉదయాన్నే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం ఎంత అశుభకరంగా పరిగణిస్తారో, అదే విధంగా మీ స్వంత నీడను, కుక్కల పోరాటాన్ని, మనస్సులో ప్రతికూల భావోద్వేగాలను కలిగించే చిత్రాలను చూడటం చాలా అశుభకరంగా పరిగణించబడుతుంది.

ఉదయాన్నే వంటగదిలో మురికి పాత్రలను చూడటం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అన్నపూర్ణ మాత అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా తిండి గింజలు కావాలి. అందుకోసం ప్రతిరోజూ రాత్రి కిచెన్ పూర్తిగా శుభ్రం చేసి, ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి.

ఉదయం పూట ఏం చేసినా దాని ప్రభావం రోజంతా మీపై ఉంటుందని విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే.. మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, లేకపోతే ఆ వివాదానికి సంబంధించి మీరు రోజంతా టెన్షన్‌గా ఉంటారు. దీని ప్రభావం మీ విజయంతో పాటు మీ సమర్థతపై కూడా కనిపిస్తుంది.

ఉదయం నిద్రలేచిన తర్వాత అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులను కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు)

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి