Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today(05-05-2022): వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు ఈరోజు తమకు ఎలా ఉందో..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: May 05, 2022 | 6:51 AM

Horoscope Today (05-05-2022): వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు ఈరోజు తమకు ఎలా ఉందో అంటూ వెంటనే  దినఫలాల (Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 5వ తేదీ ) గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక లాభాలను అందుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. లాభాలను ఆర్జిస్తారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేస్తారు. సన్నితులతో విరోధాలు ఏర్పడకుండా మెలగాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాలలో తగిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి రీత్యా స్దాన చలనం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది.  ధన నష్టాలను ఎదుర్కొంటారు. ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. కొత్త పనులను చేపడతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనకు గురవుతారు. శారీరక అనారోగ్యానికి గురవుతారు. వృధా ప్రయాణాలు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మేలు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో అనారోగ్య బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారి ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగరంగాల్లోని వారు అభివృద్ధి చెందుతారు. పిల్లలకు సంతోషం కలిగించే పనులను చేస్తారు

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి శుభవార్తను వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర భయాలకు లోనవుతారు. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వ్యాపార రంగంలోని వారు తగిన జాగ్రతలు తీసుకోవాలి. విద్యార్థులు చంచలన నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలు తమ పిల్లల పట్ల తగిన శ్రద్ధ తీసుకోడం మేలు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసికంగా సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. కొత్త పరిచయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టానికి గురవుతారు. అనారోగ్య బాధలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:  Morning Astro Tips: మంచి జరగాలని భావించేవారు ఉదయాన్నే మర్చిపోయి కూడా ఈ పని చేయకూడదు..!

Hindupuram: బాలయ్య ఇలాకాలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు

Hindupuram: బాలయ్య ఇలాకాలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు