Andhra Pradesh: ఏపీ అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిందా?.. వరుస ఘటనల వెనక రాజకీయ కుట్ర ఉందా?..

Andhra Pradesh: ఏపీలో కాదేది రాజకీయాలకు అతీతం అన్నట్టుగా సాగిపోతోంది. గడిచిన కొద్దిరోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య అత్యాచారఘటనలపై

Andhra Pradesh: ఏపీ అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిందా?.. వరుస ఘటనల వెనక రాజకీయ కుట్ర ఉందా?..
Big New Big Debate
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2022 | 12:21 AM

Andhra Pradesh: ఏపీలో కాదేది రాజకీయాలకు అతీతం అన్నట్టుగా సాగిపోతోంది. గడిచిన కొద్దిరోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య అత్యాచారఘటనలపై మాటలయుద్ధం మొదలైంది. శాంతిభద్రతల సమస్యగానూ మారుతోంది. బాధితులను పరామర్శించి స్వాంతన కలిగించాల్సిన పార్టీలు పరస్సరం దాడులు, ధర్నాలతో కావాల్సినంత రాజకీయం పండిస్తున్నాయి. అటు హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.

ఏపీ అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిందా? ఈ అరాచకాల వెనక ఉన్నది తెలుగుదేశమేనా? ఏపీలో జరుగుతున్న దురదృష్టకర ఘటనల చుట్టూ రాజకీయమే ఎక్కువగా జరుగుతోంది. నిరసనలు, ధర్నాలు, పరామర్శల్లో పోటీపడుతున్నాయి పార్టీలు. శాంతిభద్రతల సమస్య కూడా వస్తోంది. జరిగిన ఘోరాల్లో నిందితులకు శిక్ష పడటం కంటే పార్టీలకు రాజకీయమే ప్రాధాన్యతగా మారిందన్న విమర్శలున్నాయి. నేరాలు కూడా టీడీపీ నాయకులే చేసి వాళ్లే రచ్చ చేస్తున్నారంటోంది వైసీపీ. అత్యాచారాలు జరిగితే టీడీపీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారని.. టీడీపీ ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టి శాంతిభద్రతలు లోపంగా చూపిస్తోందన్నారు మంత్రి కాకాణి.

రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న తెలుగుదేశం హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలను అనుకూలంగా మలుచుకుని పొలిటికల్‌ ఎటాక్‌ చేస్తోంది. అత్యాచారాలకు తల్లులదే బాధ్యత అంటూ హోంమంత్రి చేసిన కామెంట్ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికో ఉన్మాది అంటూ పుస్తకం వేసి మరీ ప్రచారం చేస్తోంది. అటు రాష్ట్రంలో ఘటనలకు కారణం పోలీసుల వైఫల్యమేనని బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు అంటున్నారు. UPతరహాలో నిందితులను శిక్షించి కట్టడి చేయాలంటున్నారు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

ఇవి కూడా చదవండి

విజయవాడ ఆసుపత్రి గ్యాంగ్‌ రేప్‌ ఘటన నుంచి నిన్నమొన్నటి రేపల్లె రైల్వేస్టేషన్‌ అత్యాచారం వరకూ నిందితుల అరెస్టుల కంటే రాజకీయ హడావిడే ఎక్కువైంది. అధికారపార్టీ చెబుతున్నట్టు ఇందులో విపక్షాల కుట్ర ఉందా? నిందితులంతా తెలుగుదేశం నాయకులేనా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అధికారపార్టీ అండదండలున్నాయా?

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.

ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..