- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu after doing these three things take bath immediately
Chanakya Niti: ఈ మూడు పనులు చేసిన వెంటనే స్నానం చేయాల్సిందే అంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో చాలా ప్రయోజనకరమని పెద్దలు భావించారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా మనిషి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు.
Updated on: May 04, 2022 | 11:35 AM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంతోషకరమైన జీవితం, పురోగతి గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. నేటికీ ప్రజలు జీవితాన్ని సంతోషంగా గడపడానికి, విజయాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని విషయాలను సూచించాడు. ఆ విషయాలను గురించి తెలుసుకుందాం

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో నిత్యకృత్యాల గురించి చాలా విషయాలను ప్రస్తావించాడు. ఇందులో స్నానానికి సంబంధించిన అనేక విషయాలు కూడా చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, 3 విషయాలు తర్వాత మనం వెంటనే స్నానం చేయాలి.

దహన సంస్కారాల తర్వాత: అంత్యక్రియలకు వెళ్లిన వారు తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు. శ్మశానవాటికలో అనేక రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, దహన సంస్కారాల తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి.

జుట్టు కత్తిరించిన తర్వాత : ఆచార్య చాణక్యుడు ప్రకారం, జుట్టు కత్తిరించిన వెంటనే స్నానం చేయాలి. జుట్టు కత్తిరించేటప్పుడు, శరీరంపై చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. కనుక మీ జుట్టు కత్తిరించిన తర్వాత తలస్నానం చేయండి.

శరీరానికి నూనెతో మసాజ్ చేసిన తర్వాత: నూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కండరాలను బలపరుస్తుంది. అయితే ఆయిల్ మసాజ్ చేసిన వెంటనే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మురికి మొత్తం తొలగిపోతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.





























