Save Birds: పక్షుల దాహార్తిని తీర్చే సూపర్ ఐడియా ఇది.. సెల్యూట్ అంటున్న యానిమల్ లవర్స్..

Save Birds: వేసవిలో అందరికీ దాహం ఎక్కువగా ఉంటుంది. మనమంటే కూలింగ్ వాటర్, డ్రింక్స్ ఇలా అనేక రకాల పానీయాలను తాగి దాహార్తిని తీర్చుకుంటుంటాం.

Save Birds: పక్షుల దాహార్తిని తీర్చే సూపర్ ఐడియా ఇది.. సెల్యూట్ అంటున్న యానిమల్ లవర్స్..
Save Birds
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 04, 2022 | 6:17 PM

Save Birds: వేసవిలో అందరికీ దాహం ఎక్కువగా ఉంటుంది. మనమంటే కూలింగ్ వాటర్, డ్రింక్స్ ఇలా అనేక రకాల పానీయాలను తాగి దాహార్తిని తీర్చుకుంటుంటాం. అదే పక్షులు, జంతువులు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇటువంటి సమస్యకు పరిష్కారంగా కొందరు యువకులు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. పక్షుల దాహార్తిని తీర్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది. ఇలాంటి ఆవిష్కరణ చేసినందుకు వారికి కచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. వేస‌విలో జంతువులు, పక్షులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు అనేక ఎన్జీవోలు తమ వంతు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారు వాటర్ బౌల్స్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. తరువాత వాటిలో నీరు ఉందా లేదా అనే విషయాన్ని గమనించటం మరచిపోతుంటారు. ఇందుకోసం హైదరాబాద్‌ కు చెందిన బెస్ట్‌టెట్ టెక్నాలజీస్ ఓ పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. అదేంటంటే.. వాటర్ బౌల్స్ లో నీరు ఉందా లేదా, వాటిని రీఫిల్ చేయాలా అనే విషయాలను రియల్ టైమ్ లో తెలియజేసేందుకు Animal Water Bowls of India అనే యాప్ ను రూపొందించింది.

Bowl app అనే పేరుతో ఇది యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. దీనిని జీపీఎస్ టెక్నాలజీ ద్వారా ప్రతి 24 గంటలకు ఒకసారి నీటి వివరాలను సదరు బౌల్ ఏర్పాటు చేసిన వారికి మెసేజ్ రూపంలో అందిస్తారు. దీని వల్ల క్రమం తప్పకుండా నీరు అందుబాటులో ఉంచేందుకు దోహద పడుతోంది. దీనికోసం నీటి తొట్టెలను లేదా వాటర్ బౌల్స్ ను ఏర్పాటు చేసిన వారు వాటి వివరాలను ఈ యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది.

వివిధ ఎన్జీఓలతోపాటు ప్రజలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సాయంగా వాటర్ బౌల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ ప్రస్తుతం జంతు ప్రేమికుల మన్ననలు అందుకుంటోంది. కేవలం వేసవి కాలంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా పక్షులకు, జంతువులకు ఈ పద్ధతిలో నీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా రోజూ వెళ్లి వాటర్ బౌల్స్ నింపటం వల్ల వేసవి తరువాత నీళ్లలో దోమలు వృద్ధి చెందవు. జంతు ప్రేమికులు దీనిని సదవకాశంగా వినియోగించుకోవచ్చు.

ఇవీ చదవండి..

Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!

Stock Market: వడ్డీ రేట్ల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు.. 1307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..