AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Intelligence: ఇకపై ఆ వీడియోలకు చెక్.. సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు..

వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించేందుకు చేసిన ప్రయోగాలు ఫలించాయి. శాస్త్రవేత్తలు 99 శాతం ఖచ్చితత్వంతో అలాంటి వీడియోలను గుర్తించారు. దీంతో ఇకపై ఇలాంటి వీడియోలకు చెక్ పడడనున్నట్లు తెలుస్తోంది.

Artificial Intelligence: ఇకపై ఆ వీడియోలకు చెక్.. సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు..
Deepfake
Venkata Chari
|

Updated on: May 04, 2022 | 8:11 PM

Share

వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించేందుకు చేసిన ప్రయోగాలు ఫలించాయి. శాస్త్రవేత్తలు 99 శాతం ఖచ్చితత్వంతో ముఖ కవళికలను తారుమారు చేసిన డీప్‌ఫేక్ వీడియోలను ఈ విధానంతో గుర్తించారు. దీంతో ఇకపై ఇలాంటి వీడియోలకు చెక్ పడడనున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ఇతర అత్యాధునిక విధానాల కంటే ఎంతో చక్కగా పనిచేస్తుంది. డీప్‌ఫేక్ వీడియోలలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ముఖ కవళికలను మార్చుకోవడం, మరొకటి వ్యక్తి గుర్తింపును మార్చడం. ఈ సాంకేతికతో ఎలాంటి మార్పింగ్ చేసినా కూడా ఇట్టే పట్టేసుకోవచ్చని అంటున్నారు. నాయకులు, రాజకీయ లేదా ఇతర ప్రముఖల పేరుతో నెట్టింట్లో ఎన్నో ఫేక్ వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉపయోగించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించే అనేక పద్ధతులు ఉన్నాయి.

2019లో, స్టాన్‌ఫోర్డ్ ఆధారిత పరిశోధకులు ఒక వీడియోలోని వ్యక్తి పెదవులు చెబుతున్న పదాలకు అనుగుణంగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది ప్రమాదాలను చిత్రీకరించడానికి, ఇతర భాషలకు సినిమాలను అనువదించడానికి ఉపయోగించేవారు. రాజకీయ రంగంలో అమలు చేసిన సాంకేతికతను చూసిన తర్వాత, పరిశోధకులు విసిమ్-ఫినోమ్ పలు తేడాలను గుర్తించడం ద్వారా లేదా ఒక వ్యక్తి నోటి ఆకారంతోపాటు ఆ సమయంలో చేసే ధ్వని మధ్య అసమతుల్యతను గుర్తించడం ద్వారా ఫేక్ వీడియోను గుర్తించడానికి ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ విధానం 80 శాతం కచ్చితత్వంతో పనిచేసింది. Binghamton విశ్వవిద్యాలయం, ఇంటెల్ పరిశోధకులు FakeCatcher అని పిలిచే ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది గుండె కొట్టుకోవడం వల్ల కలిగే చర్మపు రంగులో సూక్ష్మమైన వైవిధ్యాలను గుర్తించింది. ఇది హృదయ స్పందన రేటును గుర్తించడానికి స్మార్ట్‌వాచ్‌లు, పల్స్ ఆక్సిమీటర్‌ల ద్వారా ఉపయోగించే టెక్నిక్. దీనిని ఫోటోప్లెథిస్మోగ్రఫీ (PSG) అని కూడా పిలుస్తారు. ఇది 90 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది.

Deepfake

ఫేక్ ఫేస్‌లను గుర్తించే విషయంలో ఇప్పటికే ఉన్న సాంకేతికతలు సహేతుకంగా ఖచ్చితమైనవి అయినప్పటికీ, ఫేక్ వీడియోలను గుర్తించడానికి ఇప్పటివరకు నమ్మదగిన సాంకేతికత లేదు. ఇది చాలా కష్టమైన పని. పేపర్ సహ రచయిత అమిత్ రాయ్-చౌదరి మాట్లాడుతూ, “డీప్‌ఫేక్ పరిశోధన ప్రాంతాన్ని మరింత సవాలుగా మార్చేది డీప్‌ఫేక్‌ల సృష్టి, గుర్తింపు, నివారణ మధ్య పోటీనేని, ఇది భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారుతుంది. ఉత్పాదక నమూనాలలో మరింత పురోగతితో, డీప్‌ఫేక్‌లను విశ్లేషణ చేయడం సులభం, కాగా, వాస్తవం నుంచి వేరు చేయడం మాత్రం కష్టం” అని అన్నారు.

కొత్త సాంకేతికత కోసం, ఒక న్యూరల్ నెట్‌వర్క్ రెండు భాగాలుగా విభజించారు. ఒకటి వ్యక్తీకరణలతో ప్రాంతాలను ట్రాక్ చేయడం కోసం కేటాయించగా, మరొకటి మానిప్యులేషన్‌ను గుర్తించడం కోసం వాడుతున్నారు. మొదటి శాఖ విచక్షణతో కూడిన ముఖ కవళికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అది ఎన్‌కోడర్-డీకోడర్ అని పిలువబడే రెండవ శాఖకు కళ్ళు, నోరు లేదా నుదిటి వంటి వ్యక్తీకరణలను క్యాప్చర్ చేస్తుంది. ఎన్‌కోడర్-డీకోడర్ ఫేక్ జరిగిందో లేదో గుర్తిస్తుంది. ఒకేవేళ ఫేక్ అయితే, ఏయే ప్రాంతాల్లో గుర్తించడానికి అవకాశం ఉందో తెలుసుకుంటుంది.

ఫ్రేమ్‌వర్క్‌ను ఎక్స్‌ప్రెషన్ మానిప్యులేషన్ డిటెక్షన్ లేదా EMD అని పిలుస్తారు. మానిప్యులేట్ ఎక్స్‌ప్రెషన్‌లను వీటితో గుర్తించవచ్చు. పరిశోధన ప్రధాన రచయిత గజల్ మజాహెరి మాట్లాడుతూ, “సాంప్రదాయ మానిప్యులేషన్ డిటెక్షన్ సిస్టమ్‌ల శిక్షణకు ప్రయోజనం చేకూర్చడానికి ముఖ కవళికల గుర్తింపు వ్యవస్థల ద్వారా నేర్చుకున్న ప్రముఖ లక్షణాలను మల్టీ-టాస్క్ లెర్నింగ్ ప్రభావితం చేయగలదు. ఇలాంటి విధానం ముఖ కవళిక మానిప్యులేషన్ డిటెక్షన్‌లో అద్భుతమైన పనితీరును సాధిస్తుంది.” అధ్యయనం కోసం ఉపయోగించే బెంచ్‌మార్క్ డేటాసెట్‌లు ఎక్స్‌ప్రెషన్‌లు, ఐడెంటిటీ మార్పిడులపై ఆధారపడి ఉంటాయి. ఒకటి సోర్స్ వీడియో నుంచి ఎక్స్‌ప్రెషన్‌లను ఐడెంటిటీని మార్చకుండా టార్గెట్ వీడియోకి బదిలీ చేస్తుంది. మరొకటి వీడియోలోని గుర్తింపులు చేసిన చోట మార్పులు చేస్తుంది. EMD నకిలీ గుర్తింపులు, ముఖ కవళికలు రెండింటికి సంబంధించిన మానిప్యులేట్ వీడియోలను గుర్తించడంలో ఎక్కువ ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది.

MIT నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు అనేక డీప్‌ఫేక్ ఆడియో, వీడియో, టెక్స్ట్ స్నిప్పెట్‌లను కంపైల్ చేస్తారు. వీటిని కంప్యూటర్లు గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. వాటిని డిటెక్ట్ ఫేక్స్ అని పిలిచే సైట్‌లో హోస్ట్ చేశారు. వెబ్‌సైట్‌లో, ఆసక్తిగల వినియోగదారులు నిజమైన కంటెంట్‌తో సమాన నిష్పత్తిలో మిళితం చేసిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను కనుగొనడానికి తమను తాము సవాలు చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతితో డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తించడం చాలా కష్టతరంగా మారుతుందని, డీప్‌ఫేక్ మీడియాను గుర్తించడానికి ప్రజలు సాంకేతికత లేని విధానాలపై ఆధారపడవలసి ఉంటుందని కంప్యూటర్ శాస్త్రవేత్తలు అంటున్న నేపథ్యంలో డీప్‌ఫేక్ కంటెంట్ గురించి అవగాహన పెంచడం కోం ఈ వెబ్‌సైట్ పనిచేస్తుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Save Birds: పక్షుల దాహార్తిని తీర్చే సూపర్ ఐడియా ఇది.. సెల్యూట్ అంటున్న యానిమల్ లవర్స్..

You Tube: యూట్యూబ్ యాడ్స్ తో విసిగిపోయారా.. ఇలా చేస్తే ఆ బాధే ఉండదు