ఉదయం లేవగానే మడమ నొప్పా.. నిర్లక్ష్యం వద్దన్న నిపుణులు

ఉదయం లేవగానే మడమ నొప్పా.. నిర్లక్ష్యం వద్దన్న నిపుణులు

Phani CH

|

Updated on: Dec 26, 2024 | 1:11 PM

కొందరిలో ఉదయం నిద్ర లేవగానే కాలి మడమల్లో నొప్పిగా అనిపిస్తుంటుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతసేపటి తర్వాత ఆ నొప్పి తగ్గిపోతుంది. కానీ మళ్లీ మరుసటి రోజుగానీ, కొన్ని రోజుల తర్వాత గానీ ఉదయమే ఇలా నొప్పి వస్తుంటుంది. దీనికి కారణాలు ఏమిటి? ఉపశమనం పొందాలంటే ఏం చేయాలనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

కాలి చీలమండ దిగువన మడమ, వేళ్ల వెనుక భాగంలో తీవ్రంగా నొప్పి రావడాన్ని ‘ప్లాంటార్ ఫాసిటిస్’ అంటారు. కాలి మడమను వేళ్లతో కలిపే ‘ప్లాంటార్ ఫాసియా’ అనే లిగమెంట్ లో సమస్యలు ఏర్పడినప్పుడు ఈ ఇబ్బంది తలెత్తుతుంది. తరచూ పాదాలపై తీవ్ర ఒత్తిడి పడే పనులు చేయడం… అంటే జాగింగ్, ఎక్కువసేపు నిలబడే ఉండటం, ఎక్కువగా మెట్లు ఎక్కిదిగడం వంటివి చేయడం వల్ల లిగమెంట్లపై ఒత్తిడి పడి ‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య వస్తుంది. అది తాత్కాలికమైన ఇబ్బంది. ఇక పాదాల అడుగుభాగం సమతలంగా ఉండటం, లేదా మధ్యలో ఎక్కువ ఎత్తుగా ఉండటం, ఊబకాయం వంటి సందర్భాల్లో కూడా ‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం లభించాలంటే… పాదాలపై ఒత్తిడి పడకుండా వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ సేపు నిలబడటం, పరుగెత్తడం వంటివి చేస్తే… లిగమెంట్లు మరింతగా దెబ్బతిని, నొప్పి చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు

వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

Jeff Bezos: అమెజాన్ బాస్‌ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు