అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, నాగార్జున, వెంకటేశ్ సహా పలువురు సినీ ప్రముఖులు గురువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా కామన్ మ్యాన్ అంటూ ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. సినిమా పెద్దలు కాదు.. గద్దలు అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. నిరసన వ్యక్తంచేసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.