ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు

ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు

Phani CH

|

Updated on: Dec 26, 2024 | 1:09 PM

ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులను ఆ సంస్థ ఎంత బాగా చూసుకుంటే అంత ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ పండుగలు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు ఇస్తుంటారు. అవి బోనస్‌లు కావచ్చు.. లేదా ఏదైనా ఖరీదైన వస్తువులు కావచ్చు. అలా సంస్థ ఉద్యోగులను ప్రోత్సహించినప్పుడు వారు మరింత అంకితభావంతో పనిచేస్తారు.

తద్వారా సంస్థ లాభాల బాటలో సాగేందుకు దోహదపడుతుంది. తాజాగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులను కానుకగా ఇచ్చింది. దాంతో ఆ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సర్‌మౌంట్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతిభావంతులైన కొందరు ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందజేసింది. పనిలో ఉద్యోగుల్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు అత్యున్నత లక్ష్యాల్ని సాధించేలా వారిని ప్రేరేపించేలా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను బహుమతులుగా అందజేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

Jeff Bezos: అమెజాన్ బాస్‌ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు