Jeff Bezos: అమెజాన్ బాస్ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది నిశ్చితార్థం చేసుకోగా.. వచ్చే వారం వివాహం చేసుకోనున్నారు. కొలరాడోలోని ఆస్పెన్‌లో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో డిసెంబర్ 28న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
బిల్‌గేట్స్, లియోనార్డో డికాప్రియో , జోర్డాన్ రాణి రానియా వంటి ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు 180 మంది పాల్గొనే ఈ వేడుక కోసం ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతిథుల వసతి కోసం లగ్జరీ హోటల్స్, ప్రైవేటు నివాసాలను ముందస్తుగా బుక్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వివాహ వేడుక కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. జెఫ్ బెజోస్, లారెన్‌లు 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు..
రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !!
అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..