ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి డింగా డింగా
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో కంట్రోల్ చేయలేని విధంగా వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు.
ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలూ సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో నియంత్రించలేని విధంగా వణుకు వస్తుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితులు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. చేతులు, కాళ్లలో వణుకు కారణంగా.. వాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా ?? రిజెక్ట్ చేయాలా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

