వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. ఇలా చేస్తే జైలు శిక్షే
వడ్డీవ్యాపారులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై ఎవరికైనా అప్పు ఇచ్చారో మీరు ఊచలు లెక్కపెట్టాల్సిందే. అవును కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. భౌతికంగా గానీ, డిజిటల్ మార్గంలో కానీ మీరు ఎవరికైనా రుణాలు ఇస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది జాగ్రత్త. ఇదేంటి అవసరానికి అప్పు ఇవ్వడం కూడా తప్పేనా? అనుకుంటున్నారా? అవసరానికి అప్పు ఇవ్వడం తప్పుకాదు..
కానీ అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి అవి వసూలు చేసుకోవడం కోసం రుణగ్రస్తులను వేధింపులకు గురిచేస్తుండటంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో రుణాలు ఇచ్చే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకూ జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఇది చట్టంగా మారితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా పర్మిషన్ లేని వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం కుదరదు. అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు 2021 నవంబర్ లో తన నివేదికను సమర్పించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: