ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ ఏమన్నారంటే

సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మార్చాలన్నారు. ఇదీ సీఎంను కలిసిన ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట. అయితే సమావేశంలో సినీ పెద్దల తీరుపై సీఎం రేవంత్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ను ప్రస్తావించారు.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ ఏమన్నారంటే
Cm Revanth reddy
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 26, 2024 | 10:03 PM

తన పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్‌పై కేసు పెట్టారని, అరెస్ట్ చేశారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే ఫీలవుతానా.? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. సీఎం పేరు మర్చిపోయారన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించాల్సిన అవసరం లేదా? అని సినీ ప్రముఖలతో భేటిలో అన్నారు. ఇప్పుడున్న హీరోలంతా నా ముందు ఎదిగినవాళ్లే అని.. హీరోలు ఎదిగితే తాను కూడా సంతోషిస్తానన్నారు రేవంత్. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మార్చాలన్నారు. ఇదీ సీఎంను కలిసిన ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట.

ఎట్టకేలకు ఇవాళ అనగా గురువారం సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దల సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధి అంశంపైనే సీఎం రేవంత్ ఎక్కువగా చర్చించారని ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. సినీ పరిశ్రమపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌కు ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం చెప్పినట్టు తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారని వెల్లడించారు. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇండస్ట్రీ సహకారం ఉండాలని.. యువత, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలని సీఎం రేవంత్ చెప్పినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇక బెనిఫిట్‌ షోలపైనా సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలతో ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలన్నారు. బెనిఫిట్ షోలతో వచ్చే డబ్బును విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామన్నారు. సినీ ఇండస్ట్రీ మనందరిదని.. దీన్ని ప్రపంచస్థాయికి తీసుకెళదామని సీఎం రేవంత్ టాలీవుడ్ ప్రముఖులకు సూచించారు.

ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి