AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Prices: సామాన్యులకు పిడుగులాంటి వార్త.. దేశంలో పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఇవాల్టీ ధరలు ఇలా..

దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ గ్యాస్‌కు దేశంలో కొరత ఏర్పడటంతో ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. అటు ముడి చమురు ధరలు కూడా పెరగడంతో గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రూ.60 మేర పెంచగా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

Gas Prices: సామాన్యులకు పిడుగులాంటి వార్త.. దేశంలో పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఇవాల్టీ ధరలు ఇలా..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Mar 11, 2026 | 2:56 PM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, పశ్చిమాసియాపై ప్రభావం క్రమంలో గ్యాస్ రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో విదేశాల నుంచి భారత్‌కు రావాల్సిన గ్యాస్ సరఫరా బంద్ కావడంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ కారణంతో దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇక హాస్టల్స్ కూడా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో టీ, కాఫీ, పలు పదార్థాలను అందించడం నిలిపివేశారు. మరికొద్ది రోజల పాటు యుద్దం ఇలాగే కొనసాగితే గ్యాస్ సంక్షోభం మరింత ముదిరే అవకాశముంది. ఇదే జరిగితే వంటింట్లో ఉపయోగించే డొమెస్టిస్ గ్యాస్ సరఫరాకు కొరత ఏర్పడే ఛాన్స్ ఉంది. భారత్‌కు ఎక్కువగా గల్ప్ దేశాల నుంచి ఎల్పీజీ, సీఎన్‌జీ దిగుమతి అవుతుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో గ్యాస్ రవాణా స్తంభించిపోవడంతో దేశంలో గ్యాస్‌కు కొరత ఏర్పడింది.

పెరుగుతున్న రేట్లు

గ్యాస్ కొరత క్రమంలో దేశంలో గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచగా.. వాణిజ్య సిలిండర్ ధరను రూ.114 పెంచారు. ఈ పెంపు తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.913కి పెరగ్గా.. కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1884కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 సిలిండర్ ధర రూ.965, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్ రూ.2105గా ఉంది. ఇక చెన్నైలో డొమెస్టిక్ సిలిండర్ రూ.925.50గా ఉండగా.. కమర్షియల్ రూ.2043గా ఉంది. ఇక బెంగళూరులో డొమెస్టిక్ రూ.915.50గా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ రూ.1958గా కొనసాగుతోంది. ఇక ముంబైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.912.50గా ఉండగా.. కమర్షియల్ ధర రూ.1836.00గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యధాతధంగా ఉన్నాయి. వీటీల్లో ఎలాంటి మార్పు లేదు. బుధవారం ముడి చమురు ధరలు తగ్గాయి. ముడి చమురు ప్యూచర్స్ బ్యారెల్‌కు 84 డాలర్ల కంటే తక్కువగా ట్రేడయ్యాయి. బ్రెంట్ ముడి చమురు 0.26 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.57 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.46గా ఉండగా.. డీజిల్ రూ.95.70గా ఉంది. ఇక బెంగళూరులో పెట్రోల్ రూ.102.92, డీజిల్ రూ.89.02గా ఉంది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.100.75గా ఉండగా.. డీజిల్ రూ.92.34గా కొనసాగుతోంది. కాగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయనే వార్తలు వినిపించాయి. కానీ తగనంత పెట్రోల్ నిల్వలు దేశంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వల్ల ధరలు పెంచడం లేేదని స్పష్టం చేసింది.

Follow Us
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
ఒక్క నిమిషంలో మీ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో కనిపెట్టండిలా!
ఒక్క నిమిషంలో మీ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో కనిపెట్టండిలా!
పెరుగు పుల్లగా మారుతోందా?.. ఈ టిప్ తో 4 రోజులైనా టేస్ట్ మారదు..
పెరుగు పుల్లగా మారుతోందా?.. ఈ టిప్ తో 4 రోజులైనా టేస్ట్ మారదు..
ఫ్యాన్స్‌కు కోహ్లీ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన వీడియో
ఫ్యాన్స్‌కు కోహ్లీ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన వీడియో
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ ఈ జిల్లాలకు అలర్ట్..
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ ఈ జిల్లాలకు అలర్ట్..
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?
ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?
అందమైన ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత అందంగా ఉన్నారో..
అందమైన ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత అందంగా ఉన్నారో..