AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కోహ్లీ స్వీట్ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన 62 సెకన్ల వీడియో ..వెంటనే డిలీట్

Virat Kohli : సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పని కూడా హాట్ టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ విషయంలో ఏ చిన్న వార్త వచ్చినా అది సెకన్లలో వైరల్ అవుతుంది.

Virat Kohli : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కోహ్లీ స్వీట్ సర్ప్రైజ్..ఇంటర్నెట్‎ను షేక్ చేసిన 62 సెకన్ల వీడియో ..వెంటనే డిలీట్
Virat Kohli
Rakesh
|

Updated on: Mar 11, 2026 | 2:42 PM

Share

Virat Kohli : సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పని కూడా హాట్ టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ విషయంలో ఏ చిన్న వార్త వచ్చినా అది సెకన్లలో వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక రీల్ ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఐపీఎల్ 2026కు సంబంధించి కోహ్లీ ఒక వీడియోను పోస్ట్ చేసి, కేవలం కొన్ని సెకన్లలోనే దానిని డిలీట్ చేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారుపడ్డారు. దీనిపై సోషల్ మీడియా వేదిక X లో Kohli అనే పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

62 సెకన్ల వీడియో.. ఏం జరిగిందంటే?

మంగళవారం రాత్రి సుమారు 9:42 గంటల సమయంలో కోహ్లీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి కొత్త వీడియో వచ్చినట్లు ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్లు వెళ్లాయి. సుమారు 62 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో కోహ్లీ తన ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ(RCB) జెర్సీలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే, వీడియో చూద్దామని ఓపెన్ చేసేలోపే అది మాయమైపోయింది. ఈ కంటెంట్ అందుబాటులో లేదు అనే మెసేజ్ రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అసలు కోహ్లీ ఆ వీడియోను ఎందుకు పెట్టాడు? పెట్టిన వెంటనే ఎందుకు తీసేశాడు? అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో రచ్చ.. ఫ్యాన్స్ గందరగోళం

ఆ వీడియో డిలీట్ అయిన వెంటనే కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. కొందరు ఇది పొరపాటున పోస్ట్ అయి ఉంటుందని భావిస్తే, మరికొందరు ఐపీఎల్ 2026 ప్రమోషన్ కోసం చేస్తున్న స్టంట్ అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకొంతమంది అయితే కోహ్లీ అకౌంట్ హ్యాక్ అయిందేమోనని ఆందోళన చెందారు. గతంలో కూడా కోహ్లీ అకౌంట్‌లో పోస్ట్‌లు కనిపించకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ అదే వీడియోను మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బహుశా ఎడిటింగ్‌లో మార్పుల వల్ల లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల ముందుగా డిలీట్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్న కింగ్

వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ ఎంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడో అర్థమవుతోంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈసారి తమ కింగ్ కప్పు కొట్టడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఏది ఏమైనా, కోహ్లీ ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా అది దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుందంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా కోహ్లీయే అసలైన బాద్షా అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us