Telangana: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తికాగా.. నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. ఒకరోజు ముందే.. స్పీకర్ కడియం, దానం నాగేందర్ పై దాఖలైన రెండు పిటిషన్లను డిస్మిస్ శారు.
దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..
స్పీకర్ తీర్పు తర్వాత దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశానని దానం నాగేందర్ పేర్కొన్నారు. తన ఫండమెంటల్ రైట్‌ను కాలరాసే హక్కు ఎవరికీ లేదని.. ఆరు నెలలుగా క్షోభను అనుభవించానన్నారు. స్పీకర్‌ని కూడా ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతూ వచ్చారని.. దానం పేర్కొన్నారు.
ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కారు గుర్తుతో పోటీచేసిన కడియం శ్రీహరి..కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషనపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగనుంది. దాంతో.. అంతకంటే ముందే స్పీకర్ తన తీర్పును వెల్లడించారు.
