AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో విషాదం వెలుగు చూసింది. కల్తీ పాలు తాగిన మరో రెండున్నర సవంత్సరాల బాలుడు నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్తీపాల ఘటనలో గత నెల 19వ రెయిన్‌బో హాస్పిటల్‌లో చేరిన కృతిరాజ్ దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత ఇవాళ తుదిశ్వాస విడిచాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?
Rajahmundry Adulterated Milk
Anand T
|

Updated on: Mar 11, 2026 | 3:00 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రం సంచలనం సృష్టించిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఇంతకు ఇంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత గత నెల 19న నగరంలోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చేరిన జై కృతిరాజ్ అనే రెండున్నర ఏళ్ల బాబు తాజాగా చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత తల్లిదండ్రులను ఓదార్చి సర్ధి చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రిలోని సరూర్నగర్‌కు చెందిన నాగ వెంకటేష్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరైన కృతిరాజ్‌కు శివరాత్రి తర్వాత ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన తండ్రి నాగవేంకటేష్ స్వయంగా కుమారుడికి పాలు పట్టించాడు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బాలుడిని నగరంలోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు వెంటనే వైద్యం అందించారు. అప్పటి నుంచి బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఉన్నాడు.

అయితే ఈరోజు మధ్యాహ్నం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో బాలుడికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. ఆ వెంటిలేటర్‌పైనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావడంతో గుండె పగిలేలా రోధించారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి తోటి రోగులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Follow Us