నవ్వండయ్య బాబు.. మనసారా నవ్వితే ఎన్ని లాభాలో తెలుసా?
Samatha
03 April 2026
నవ్వ వయ్యబాబు నీ సొమ్మ ఏం పోతుంది అంటూ మనం నవ్వు గురించిన అనేక పాటలు వింటుంటాం.
సాంగ్స్
చిరు నవ్వులతో బతకాలి చిరంజీవిలా బతకాలి ఇలా నవ్వుతూ.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో పాటల ద్వారా చెప్పడం జరిగింది
చిరు నవ్వు
అయితే ఈ మధ్య కాలంలో ఉద్యోగం, వర్క్ ఫ్రెషర్, ఉరుకుల పరుగుల జీవితంతో ఆనందంగా, కాసేపు నవ్వుతూ ఉండే క్షణాలే తగ్గిపోయాయంట.
ఉరుకుల పరుగుల జీవితం
అంతే కాకుండా చాలా మంది ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారంట. అందువలన మనసారా నవ్వడం ఆరోగ్యానికి మంచిది, దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ప్రయోజనాలు
ప్రతి రోజూ కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మనసారా నవ్వడం వలన ఇది ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుందంట.
మనసారా నవ్వడం
ప్రతి రోజూ నవ్వడం వలన ఇది రక్తనాళాలను సాగేలా చేస్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగు పడి, గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందంట.
గుండె ఆరోగ్యం
ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వలన ఎండార్ఫిన్లు విడుదలై, మనసు కుదట పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మానసిక ప్రశాంతత
అంతే కాకుండా ప్రతి రోజూ నవ్వుతూ ఆనందంగా ఉండటం వలన ఆయువు రేటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.