AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్‌ మర్చిపోయారా.. టెన్షనొద్దు! జస్ట్ ఇలా చేయడంతే

మనం బస్సులో ప్రయాణించేప్పుడు కొన్ని సార్లు వస్తువులను అందులోని మర్చిపోయి దిగిపోతూ ఉంటాం. కొన్ని సార్లు ఈ వస్తువులు తిరిగి వచ్చినా మరికొన్ని సార్లు అటే పోతాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఏపీఎస్‌ ఆర్టీసీ సరికోత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు బస్సుల్లో పొరపాటున మర్చిపోయిన లగేజి లేదా ఇతర వస్తువులను తిరిగి అప్పగించేందుకు లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్ అనే సరికోత్త విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానం ఎలా పనిచేస్తోంది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్‌ మర్చిపోయారా.. టెన్షనొద్దు! జస్ట్ ఇలా చేయడంతే
Apsrtc Lost Property Handover
Anand T
|

Updated on: Mar 11, 2026 | 4:58 PM

Share

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో కొన్ని సార్లు కంగారులో బస్సులోనే వస్తువులు మర్చిపోయి దిగిపోతుంటారు ప్రయాణికులు. కొన్ని సందర్భాల్లో ఆ వస్తువులు తిరిగి అప్పగిస్తుంటారు. మరి కొన్నిసార్లు మాత్రం అవి మనవరకు చేరవు. ఇక వాటిపై ఆశలు వదిలేసుకోనే పరిస్థితులు వస్తాయి.ఈ సమస్యపై దృష్టి సారించిన ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి వాళ్లకు అప్పగించేందుకు లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధాన్ని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌ డెస్క్‌ టోల్‌ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.

ఏపీ బస్సులో లగేజ్ మర్చిపోతే కాల్ చేయాల్సిన నెంబర్

పొరపాటున ఎవైన తమ వస్తువులను బస్సులో మర్చిపోతే వారు వెంటనే ఆర్టీసీ టోల్‌ ప్రీ నెంబర్.. 0866-2670005 ఫోన్‌ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఈ హెల్ప్ డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయితే మీ వస్తువు మర్చిపోయామని మీరు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసినప్పుడూ ఏ డిపో బస్సులో ప్రయాణించారు, ఎక్కడ దిగిపోయారు, మీరు మర్చిపోయిన లగేజి ఏంటి, టికెట్‌పై ఉండే డ్రైవర్, కండక్టర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.

తెలంగాణ బస్సులో లగేజ్ మర్చిపోతే కాల్ చేయాల్సిన నెంబర్

మీరు వివరాలు చెప్పిన వెంటనే హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ నుంచి సదురు డిపోకు కాల్ చేసి ప్రయాణికుడి వివరాలు నిర్ధారించుకుని వారి వస్తువులను వారికి తిరిగి అప్పగిస్తారు. ఒక వేళ మీరు టికెట్‌ను మిస్ చేసుకుంటే నేరుగా డిపోకు వెళ్లి సమాచారం ఇవ్వవచ్చు. మీరు తెలంగాణకు సంబంధించిన బస్సులో లగేజ్ మర్చిపోయి ఉంటే “040-69440000 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి.

లగేజ్ విషయంలో జాగ్రత్త

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణికులు బస్సులో తమ విలువైన వస్తువులను మర్చిపోతూ ఉన్నారు. వాటిలో బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు సైతం ఉంటున్నాయి. ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్లు సైతం నిజాయితీగా వాటిని డిపోలో అందిస్తున్నారు. అక్కడి సిబ్బంది బాధితుల వివరాలు తెలుసుకొని వారికి తమ వస్తువులను చేరవేస్తున్నారు. అంతేకాదు తమ లగేజ్, వస్తువల విషయంలో ప్రయాణికులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్ మర్చిపోయారా..టెన్షనొద్దు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్ మర్చిపోయారా..టెన్షనొద్దు
భారత్‌పై అమెరికా రాయబారి ప్రశంసలు
భారత్‌పై అమెరికా రాయబారి ప్రశంసలు
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే