మహారాష్ట్రలోని పాల్గర్లో నాలుగేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యంత కర్కశంగా దాడి చేశాడు. బాలిక తండ్రితో గొడవ నేపథ్యంలో ప్రతీకారంగా పసిపాపను నేలకేసి కొట్టి, ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.