పేరుకు గ్లోబల్ స్టార్ .. కానీ.. రామ్ చరణ్ గురించి ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

02 April 2026

Basha Shek

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ సోదరి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది. ఆమె నిర్మించి రాకాస ఏప్రిల్ 03న విడుదల కానుంది.

రాకాస సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా నిర్వహించింది నిహారిక అండ్ టీమ్.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది నిహారిక. అదేంటంటే..

సాధారణంగా సెలబ్రిటీలు నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లతో గడుపుతారు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే రామ్ చరణ్ అలా కాదంటోంది నిహారిక.

'చరణ్ అన్నయ్యకు ఫోన్ వాడటం అస్సలు ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే ఆయనకు ఫోన్ ఎలా వాడాలో కూడా సరిగ్గా తెలియదు'

 'ఫోన్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా హడావుడికి దూరంగా ఉంటూ, ప్రశాంతమైన జీవనశైలిని గడపడం చరణ్‌కు ఇష్టం' అని నిహారిక పేర్కొంది.