AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

పండగలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు శుభకార్యం ఏదైనా సరే.. ఇంట్లో స్వీట్ల సందడి ఉండాల్సిందే. ఏదైనా మంచి శుభవార్త విన్నప్పుడు కూడా నోరు తీపి చేయాలని అంటారు పెద్దలు. పిల్లల రిజల్ట్స్‌, ఉద్యోగం, మంచి ఆదాయం, పెళ్లి చూపులు.. ఇలాంటి సందర్భాల్లో స్వీట్లు తప్పనిసరి. ఇంటికి వచ్చిన అతిథులకు, బంధువులకు పెట్టేందుకు కాస్త స్వీటు, హాటూ రెండూ తప్పనిసరి. అలాంటి స్వీట్లలో మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) అందరికీ నచ్చే స్వీట్స్‌. గణపతి పూజ, హనుమాన్ ప్రసాదంగా కూడా మోతీ చూర్‌ లడ్డూలను సమర్పిస్తుంటారు. ఇలా దేవుడికి, భక్తులకు అందరికీ ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డూలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Jyothi Gadda
|

Updated on: Apr 02, 2026 | 9:03 PM

Share
మోతీచూర్‌ లడ్డూ తయారు చేయడానికి శనగపిండి (Besan), చక్కెర, నెయ్యి ప్రధాన పదార్థాలు. ముందుగా శనగపిండిని పల్చని మిశ్రమంగా చేసుకుని, చిన్న రంధ్రాలున్న గరిటెతో వేడి నూనెలో లేదా నెయ్యిలో వేసి సన్నని బూందీలా వేయించాలి. మరోవైపు చక్కెర పాకం సిద్ధం చేసి, అందులో కొద్దిగా యాలకుల పొడి, ఫుడ్ కలర్, వేయించిన బూందీని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

1 / 5
మోతీ చూర్‌ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి (Besan) - 2 కప్పులు, చక్కెర - 1.5 కప్పులు, నెయ్యి - వేయించడానికి సరిపడా, యాలకుల పొడి - అర టీస్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు, 
పుచ్చగింజలు లేదా డ్రై ఫ్రూట్స్ - అలంకరణ కోసం తీసుకోవాలి.

మోతీ చూర్‌ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి (Besan) - 2 కప్పులు, చక్కెర - 1.5 కప్పులు, నెయ్యి - వేయించడానికి సరిపడా, యాలకుల పొడి - అర టీస్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు, పుచ్చగింజలు లేదా డ్రై ఫ్రూట్స్ - అలంకరణ కోసం తీసుకోవాలి.

2 / 5
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని, అందులో నీళ్లు పోస్తూ గడ్డలు లేకుండా పల్చగా (జారుడుగా) కలుపుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి, బూందీ గరిటె సాయంతో పిండిని నూనెలో వేయాలి. ఇవి చిన్న ముత్యాల్లా (మోతీ) రావాలి. బూందీని మరీ ఎర్రగా కాకుండా తేలికగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో చక్కెర, నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఇందులో యాలకుల పొడి, ఫుడ్ కలర్ కలపాలి.

3 / 5
తయారు చేసుకున్న బూందీని ఈ వేడి పాకంలో వేసి బాగా కలిపి, మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. దీనివల్ల బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చగింజలు కలిపి, నెయ్యి రాసిన చేతులతో గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి.

4 / 5
మిశ్రమం చాలా గట్టిగా ఉంటే బూందీ పెద్దగా వస్తుంది. కాబట్టి పలుచగా ఉండాలి. లడ్డూలు మృదువుగా రావాలంటే బూందీని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే పాకంలో కలపాలి. ఎంతో రుచికరమైన, శుభ్రమైన మోతీచూర్ లడ్డూలు సిద్ధం. వీటిని దేవుడికి నైవేద్యంగా పెట్టి, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయవచ్చు. భక్తితో చేసే ఈ వంటకం స్వామివారికి తప్పక చేరుతుంది.

5 / 5
Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలపై బాబా వంగా ఏం చెప్పారంటే..?

సమ్మర్లో ఇలా చేస్తే మీ కారు వెంటనే కూలైపోతుంది..

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌
స్నానం వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఇలా చేస్తే జీవితమే మారిపోతుందట!

కోళ్ల గూడు నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కదలకుండా ఉన్న..

ఆమెతో స్పెషల్ సాంగ్.. దెబ్బకు 365 రోజులు థియేటర్లు హౌస్‌ఫుల్..

ద్యావుడా కదిలే రైలులోనే వట సావిత్రి వత్రం చేసిన మహిళ!వీడియో వైరల్

అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతున్నారా? మీ ప్రేమ డేంజరే

కష్టపడినా గుర్తింపు రావట్లేదా? బుధ గ్రహ అనుగ్రహం ఇలా చేయండి

నడి రోడ్డుపై యోగా స్టంట్,చేతులు, కాళ్లు ముడుచుకుని స్కూటర్ నడిపిన