Krithi Shetty: అనిల్ రావిపూడి చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి
కృతి శెట్టికి 'ఉప్పెన' తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేకున్నా, అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఏప్రిల్‌లో విడుదలవుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' ఆమె కెరీర్‌కు కీలకం. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, ప్రదీప్ రంగనాథన్‌తో ఈ చిత్రం కృతికి విజయాన్ని అందిస్తే, అనిల్ రావిపూడి-కల్యాణ్ రామ్‌తో చేయబోయే తదుపరి సినిమాకు మార్గం సుగమం అవుతుంది. బేబమ్మకు ఈ వేసవి చాలా ముఖ్యం.
సినిమా ఇండస్ట్రీ ఎవరికీ పదే పదే అవకాశాలివ్వదు. వచ్చే ఒక్క అవకాశాన్నీ వినియోగించుకోవాలి. ఒక్కో ఛాన్సునీ పట్టుకోగలగాలి. వాటి ద్వారానే సక్సెస్ కావాలి. కానీ, సక్సెస్ లు పెద్దగా పలకరించకపోయినా, అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి కృతి శెట్టి. ఈ కన్నడ బ్యూటీ సమ్మర్‌లో ప్రూవ్ చేసుకునే అవకాశాలున్నాయా? ఉప్పెన సినిమా చూసిన వారెవరూ బేబమ్మను మర్చిపోలేరు. ఈ లేడీ టాప్ ఛెయిర్‌లో ఏలడం ఖాయం అనుకున్నారంతా. ఆమె ఏ సినిమా చేసినా, ఏ వేడుకకు హాజరైనా అలా చూస్తుండిపోయారు కుర్రకారు. సక్సెస్‌లు పలకరించకపోతే వారు మాత్రం ఎన్ని రోజులని బ్యాకప్ ఇస్తారన్నట్టుంది పరిస్థితి. హిట్లు లేనంత మాత్రం బేబమ్మకు అవకాశాలేం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఛాన్సులు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డ ప్రాజెక్టులు అమ్మడికి బ్యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తేవడం లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి సాధ్యమవుతుందా? నయనతార హజ్బెండ్ విఘ్నేష్ శివన్ డైరక్ట్ చేస్తున్న సినిమా లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మూవీతో అయినా బేబమ్మకు సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు జనాలు. ఈ సినిమా సక్సెస్ అయతే, నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేసే సినిమాకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. అనిల్ డైరక్షన్‌లో కల్యాణ్ రామ్‌తో కృతి జోడీ కడతారన్నది న్యూస్. అతి త్వరలోనే ఈ మూవీ ఓపెనింగ్ జరగనుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

