కోడిగుడ్ల నాణ్యత, భద్రతకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి యూపీలో విక్రయించే ప్రతి గుడ్డుపై తప్పనిసరిగా గడువు తేదీని ముద్రించాలి. నిల్వ ఉష్ణోగ్రత ఆధారంగా గుడ్లపై గులాబీ లేదా నీలం రంగు స్టాంపులు ఉంటాయి. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది.