AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీల మీద కన్నేసిన యంగ్ స్టర్స్

ఓటీటీల మీద కన్నేసిన యంగ్ స్టర్స్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 8:46 PM

Share

తెలుగు యంగ్ హీరోలు ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌పైనా దృష్టి సారిస్తున్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ఇది ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త వెబ్ సిరీస్, కిరణ్ అబ్బవరం ఓటీటీ ప్రాజెక్ట్, తేజ సజ్జా 'ది ట్రైటర్స్' హోస్టింగ్, ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు' మూవీ, నాగ చైతన్య 'దూత' సీక్వెల్ - ఇలా డిజిటల్ వేదికపై తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.

యంగ్‌ హీరోలు ఇప్పుడు సినిమాలతోనే కాదు, ఓటీటీ కంటెంట్‌తోనూ క్లిక్‌ కావాలనుకుంటున్నారు. ప్రేక్షకులకు దగ్గర కావడమే ముఖ్యం మనకు.. ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే ఏంటని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి వారు ఎవరు? చూసేద్దాం వచ్చేయండి… డీజే టిల్లు ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు జోరు పెంచారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, ఓటీటీలో ఓ సీరీస్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్ ని టేకప్‌ చేస్తారనే టాక్‌ నడుస్తోంది. కెరీర్‌ని పద్ధతిగా ప్లాన్‌ చేసుకుంటున్న కిరణ్‌ అబ్బవరం కూడా ఓ సీరీస్‌లో నటిస్తున్నారిప్పుడు. సుధీర్‌బాబు హీరోగా ప్రవీణ్‌ సత్తారు డైరక్షన్‌లో ‘గల్లీ’ అనే సీరీస్‌ తెరకెక్కుతోంది. రీసెంట్‌గా వరుస ప్రాజెక్టులతో మెప్పిస్తున్న తేజ సజ్జా ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో హోస్ట్ చేస్తారనే టాక్‌ ఈ మధ్య హాట్‌ టాపిక్‌. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా, వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో ‘తక్షకుడు’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా కసం కూడా ఓటీటీ ప్రేక్షకులు ఇష్టంగా వెయిట్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌ కంటెంట్‌తో అలరిస్తారనే పేరుంది ఆనంద్‌ దేవరకొండకు. అతీంద్రియ శక్తులు, నేర నేపథ్యంతో థ్రిల్లర్‌గ మెప్పించింది ‘దూత’. ఈ సీరీస్‌కి ఇప్పుడు సీక్వెల్‌ రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వృషకర్మతో బిజీగా ఉన్న చైతూ, దూత విశేషాలని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us