ప్రేమించి మోసం చేస్తే పుట్టగతులు ఉండవు.. నాశనమైపోతారు.. టాలీవుడ్ నటి

Rajitha Chanti

Pic credit - Instagram

02 April 2026

90వ దశకంలో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని తనదైన ముద్ర వేసింది.

తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో తిరిగి రీఎంట్రి ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్, పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకుంది.

సాధారణంగా బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది అంటారు.. కానీ అంతకు సమానంగా మరో పెయిన్ ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే. 

అది చేసినవాళ్లు ఆడవాళ్లైనా, మగవాళ్లైనా సరే.. వాళ్లకు పుట్టగతులు ఉండవు. సర్వనాశనం అయిపోతారు. పుట్టింది ప్రేమించడానికి కాదు సాధించడానికి అని అన్నారు.

అలాగే ప్రతి ఉంటేనే సినీరంగంలో నిలదొక్కుకుంటాం. లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం. టాలెంట్ అవకాశం వస్తుంది. కానీ లక్ ఉంటేనే సక్సెస్ వస్తుందని అన్నారు.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మాట్లాడటం లేదని.. సక్సెస్ తోపాటు స్టేటస్, డబ్బు ఉంటేనే మాట్లాడుతున్నారని.. ప్రాబ్లమ్ వస్తే ఎవరికీ కాల్ చేయనని చెప్పారు ఇంద్రజ.

తన తల్లి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన విషయంలో జీవితాంతం వేధించే ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం తనకు అలాగే ఉండిపోయిందని అన్నారు.