Hyderabad: ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా
Hyderabad: ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్. ఇండియన్ సిన్మా ఇండస్ట్రీ క్యాపిటల్‌గా హైదరాబాద్. ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీలో ఇదే మెయిన్ పాయింట్. వివాదాలకు తావులేకుండా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఓటీటీలకు హైదరాబాద్‌ని కేరాఫ్‌గా మార్చాలని సంకల్పించారు..
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ప్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. వివాదాలు పక్కన పెట్టి పరిశ్రమ అభివృద్దితో పాటు, రాష్ట్రాభివృద్దిలో భాగం కావాలని రెండు పక్షాలూ నిర్ణయం.
నిన్నటిదాకా అపోహలు. అనుమానాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో.. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లపెంపుపై సీరియస్ నిర్ణయాలు. టాలీవుడ్ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్‌తో అన్నీ పటాపంచలైపోయాయి. ఆ ఒక్కటీ తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కారు. అదేమంత సమస్యేకాదు.. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్ అదేనంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కారు, సిన్మా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకటే మాట. ఇండియన్ ఫిల్మ్ క్యాపిటల్‌గా హైదరాబాద్.
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని టాలీవుడ్ ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. పాన్ ఇండియా సిన్మాలతో తన సత్తాచాటింది. టేకింగ్ నుంచి కలెక్షన్స్‌దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపింది. ఆస్కార్ విశ్వ వేదికపై కూడా తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనాన్ని సగర్వంగా చాటింది. ఇప్పుడు ఫిల్మ్ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్‌లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్ అరెస్ట్‌తో వాతావరణం హీటెక్కిన టైంలో.. దిల్‌రాజు చొరవతో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు.
పుష్పరాజ్ కేసుపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో సీఎంని కలుసుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ సహా 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తానని పరిశ్రమ పెద్దలకు హామీఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న సీఎం.. ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ఐటీ, ఫార్మాలాగే సినీపరిశ్రమ కూడా తమకెంతో ముఖ్యమన్నారు సీఎం. ఇండస్ట్రీని అన్నివిధాలా ప్రోత్సహిస్తామని టాలీవుడ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
పరిశ్రమ పెద్దల సలహాలు, విన్నపాలను విన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వంనుంచి కొన్ని ప్రతిపాదనలు వారి ముందుపెట్టారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. మహిళల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంపై సినీ ప్రముఖులు చొరవ చూపాలని కోరారు. టెంపుల్, ఎకో టూరిజాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలన్నారు రేవంత్‌రెడ్డి. ఎనిమిది సిన్మాలకోసం తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని గుర్తుచేసిన సీఎం.. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పుష్పటూ ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇకపై కుదరదని నిష్కర్షగా చెప్పేసింది. అసెంబ్లీలోనే దీనిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. సినీ పరిశ్రమ పెద్దలతో భేటీలోనూ ఈ అంశం చర్చకొచ్చింది. అయితే చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని సీఎం తేల్చిచెప్పారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారు FDC ఛైర్మన్ దిల్ రాజు. ఇండస్ట్రీ అభివృద్ధే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమన్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు దిల్‌రాజు.
ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్. ఇండియన్ సిన్మా ఇండస్ట్రీ క్యాపిటల్‌గా హైదరాబాద్. ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీలో ఇదే మెయిన్ పాయింట్. వివాదాలకు తావులేకుండా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఓటీటీలకు హైదరాబాద్‌ని కేరాఫ్‌గా మార్చాలని సంకల్పించారు. సమావేశంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే.. తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు హీరో నాగార్జున. యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు నాగ్.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టాలీవుడ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు అల్లు అరవింద్. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు సమావేశానికి హాజరైన నిర్మాతలు, దర్శకులు. హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ చిరకాల స్వప్నమన్నారు ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్‌బాబు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని హైదరాబాద్‌లో నిర్వహించాలన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
తొక్కిసలాట ఘటనపై జరిగిన రచ్చతో సిన్మా ఇండస్ట్రీలో కాంపిటీషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురళీమోహన్. సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఎలక్షన్ రిజల్ట్ లాగే ఉంటోందన్నారు. కాంపిటిషన్ వల్లే సిన్మా ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు మురళీమోహన్. అయితే శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తుందని సినీ పెద్దలకు స్పష్టంచేశారు సీఎం రేవంత్‌రెడ్డి. సిన్మాఫంక్షన్లు, షోలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టాలీవుడ్ ప్రతినిధులకు డీజీపీ జితేందర్ సూచించారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.
పెద్ద టాస్క్‌ని రీచ్ కావడమే తమముందున్న టార్గెట్: దిల్‌రాజు
అపోహలు పెట్టుకోవద్దు. ఎలాంటి అనుమానాలూ వద్దు. కలిసి పనిచేద్దామని సర్కారు, సినీ ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యాయి. హైదరాబాద్‌లో పెద్ద కాంక్లేవ్ ఏర్పాటు చేసి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం. కీలక సమయంలో మీటింగ్ ఫలప్రదంగా జరగటంతో.. కార్యాచరణపై సీఎంతో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు ఇండస్ట్రీ పెద్దలు. తెలంగాణ బ్రాండ్‌ని పెంచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఎఫ్‌డీసీ ఛైర్మన్. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పెద్ద టాస్క్‌ని రీచ్ కావడమే తమముందున్న టార్గెట్టన్నారు దిల్‌రాజు.
తొక్కిసలాట ఘటన తర్వాత ఇండస్ట్రీపై సర్కారు అసహనంతో ఉందన్న ప్రచారం జరిగింది. యూఎస్‌నుంచి రాగానే సీఎంని కలుసుకున్న దిల్‌రాజు.. అపాయింట్‌మెంట్ అడిగి రెండ్రోజుల్లోనే టాలీవుడ్ ముఖ్యులతో భేటీకి చొరవచూపారు. మీటింగ్‌లో చర్చించిన అంశాలను అమలు చేసే విషయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్‌కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు నిర్మాతలు ఉంటారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా కమిటీలో ఉంటారు. ఐదుగురు లేదా ఏడుగురితో ఏర్పాటయ్యే ఈ సబ్ కమిటీ టికెట్ల రేట్ల అంశంతో పాటు అన్ని సమస్యలపై చర్చిస్తుంది.
గద్దర్ పేరుతో అవార్డులు:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నంది అవార్డుల పేరుని గద్దర్ అవార్డులుగా మార్చింది. అయితే ఇప్పటిదాకా ఈ అవార్డులకు సంబంధించి ఇండస్ట్రీనుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందలేదు. తాజా మీటింగ్‌లో గద్దర్ అవార్డులపైనా సీఎంతో చర్చించారు టాలీవుడ్ పెద్దలు. టాలీవుడ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమన్న సీఎం మాటలతో ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాపీ. సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తుచేసిన సీఎం.. ఆ వారసత్వాన్నే కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం సానుకూల స్పందనతో ఇండస్ట్రీ కూడా స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ రియాక్టవుతోంది.
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ప్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ఇప్పటికీ బాలివుడ్‌ను మించి తెలుగు సినిమా పరిశ్రమకు గ్లోబల్ గుర్తింపు ఈ దశ నుంచి వేరే లెవల్‌కు వెళ్ళాలని సూచన.
సంకల్పం ఉండాలి:
సంకల్పం ఉండాలి. సమన్వయం కుదరాలి. సీఎంతో భేటీలో చర్చించిన అంశాలు, పెట్టుకున్న లక్ష్యాలు అసాధ్యమేమీ కాదంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే టాలీవుడ్ సిన్మా ఎప్పుడూ ప్రాంతీయం కాదు. తెలుగు రాష్ట్రాలకే గిరిగీసుకుని కూర్చోలేదు. కొన్నాళ్లుగా దేశమంతా మార్మోగుతోంది టాలీవుడ్ పేరు. పాన్ ఇండియా సిన్మాలతో అదరగొట్టేస్తున్నారు మన మూవీ మేకర్స్.
జక్కన్న చెక్కిన బాహుబలి యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కట్టిపడేసింది. ట్రిపులార్ రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డుతో తెలుగు సిన్మా దమ్మేంటో చూపించింది. ఇక నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898AD అయితే హాలీవుడ్ మేకర్స్‌ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక పుష్పటూ మేనియా గురించి చెప్పాల్సిన పనేలేదు. బాలీవుడ్ అయినా జపాన్‌లాంటి ఫారిన్ కంట్రీలైనా మన సిన్మా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయంటే.. ఇండియన్ సిన్మా ఇండస్ట్రీకి ఎప్పుడో బిగ్‌బాస్‌గా మారిపోయింది టాలీవుడ్.
హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది:
80వ దశకంలో చెన్నైనుంచి తెలుగుసినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చినప్పటినుంచీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. ఎప్పుడో 68ఏళ్లక్రితమే ప్రారంభమైన సారధి స్టూడియోస్ నుంచి మొదలుపెడితే అరడజనుకు పైనే ప్రతిష్టాత్మక స్టూడియోలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. దాదాపు 2వేల ఎకరాల్లో 28 ఏళ్లక్రితం నిర్మించిన ఫిల్మ్‌సిటీ ప్రపంచంలోనే అతి పెద్దది. ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళిలాంటి దర్శకులు హైదరాబాద్ పరిసరాల్లోనే వరల్డ్‌క్లాస్ సిన్మాల్ని షూట్ చేస్తున్నారు. విజువల్స్ ఎఫెక్ట్ పరంగా కూడా వరల్డ్‌మ్యాప్‌లో హైదరాబాద్‌కో ప్రత్యేక గుర్తింపు ఉంది.
అన్నపూర్ణ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్ లాంటి చోట్ల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సిన్మాల పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికీ బయట జరుగుతోందంటే కారణం.. అనుకున్న సమయానికి ఔట్‌పుట్ కోసమే. అందుబాటులో ఉన్న వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో భారీ సెట్స్ అవసరం లేకుండానే సినిమాలు తీయొచ్చు. కల్కి 2898 ఏడీ, దేవర, బాహుబలి, ట్రిపులార్ లాంటి విజువల్ వండర్స్‌ని హైదరాబాద్‌లోనే సృష్టించారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న విశ్వంభర వర్క్ కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతోంది.
హైదరాబాద్‌కి హాలీవుడ్ స్థాయి:
ఆర్థిక రాజధాని కాబట్టి ముంబైలో సెటిలైందికానీ.. అక్కడి బాలీవుడ్‌ని టాలీవుడ్ ఎప్పుడో మించిపోయింది. హైదరాబాద్‌కి హాలీవుడ్ స్థాయి ఉందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియాలో తొలి ఆస్కార్ అవార్డ్ సాధించిన సిన్మా తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది. మన దగ్గరే గ్రాఫిక్స్ వర్క్‌తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతుందంటున్నాయి సినీవర్గాలు. 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించి ఏవిధంగా చూసినా హైదరాబాద్ అందరికీ అనువైన ప్రదేశం. అందుకే సీఎం హామీతో.. టాలీవుడ్‌ని ఇండియన్ సిన్మా క్యాపిటల్‌గా, ఇంటర్నేషనల్ సినీ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంవైపు దృష్టిసారించింది ఫిల్మ్ ఇండస్ట్రీ.
ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అదే సమయంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లంటోంది ప్రభుత్వం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో హీరో హీరోయిన్లు పాల్గొనాలని ప్రతిపాదించారు రేవంత్‌రెడ్డి. టికెట్ల ధరలపై విధించే సెస్‌ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకోసం వినియోగిస్తామన్నారు. సినిమా ర్యాలీలు నిషిద్దమని చెప్పేశారు. సెలబ్రిటీలు ఏ ఈవెంట్ నిర్వహించినా పర్మిషన్ తీసుకోవాలని.. పోలీసులు సహకరిస్తామంటేనే ప్రోగ్రామ్ నిర్వహించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఇప్పుడున్న హీరోలంతా తన ముందు ఎదిగినవారేనన్న రేవంత్.. ఎవరో తన పేరు మరిచిపోతే ఎందుకు ఫీలవుతానని పరిశ్రమ పెద్దల దగ్గర ప్రస్తావించారు. అలాంటి ప్రచారాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఖండించకపోవడాన్ని ప్రశ్నించారు. దీంతో టాలీవుడ్ పెద్దలు కాస్త సంకటంలో పడ్డా.. ఇండస్ట్రీకి అన్నివిధాలా సహకరిస్తామన్న హామీతో సంతృప్తిచెందారు. ఆల్ ఈజ్ వెల్. అంతా ఓ పట్టుపడితే టాలీవుడ్ ఇక టాప్‌లెవల్.