AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేస్తోంది.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్

IPL 2026 : టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన ఆనందంలో దేశమంతా మునిగిపోయి ఉంది. మన ఛాంపియన్లు ప్రస్తుతానికి చిన్న గ్యాప్ తీసుకుని ఇళ్లలో సేదతీరుతున్నారు. తీసుకుని ఇళ్లలో సేదతీరుతున్నారు. అయితే ఈ టైం గ్యాప్ ఎంతో కాలం ఉండదు.

IPL 2026 : ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేస్తోంది.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్
Rcb Vs Csk
Rakesh
|

Updated on: Mar 11, 2026 | 4:18 PM

Share

IPL 2026 : టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన ఆనందంలో దేశమంతా మునిగిపోయి ఉంది. మన ఛాంపియన్లు ప్రస్తుతానికి చిన్న గ్యాప్ తీసుకుని ఇళ్లలో సేదతీరుతున్నారు. తీసుకుని ఇళ్లలో సేదతీరుతున్నారు. అయితే ఈ టైం గ్యాప్ ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులకు అసలైన ఎంటర్టైన్మెంట్ పంచే ఐపీఎల్ 2026 (IPL 2026) జాతర మొదలవడానికి సమయం దగ్గరకు వస్తోంది. ఈ కొత్త సీజన్‌లో ప్రపంచ విజేతలైన మన స్టార్ ప్లేయర్లు తమ తమ ఫ్రాంచైజీల తరపున అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రంగంలోకి దిగబోతుంది.

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31 వరకు సాగనుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఇంకా అధికారికంగా రానప్పటికీ, బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా కీలక అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 12 లోపు మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ తొలి మ్యాచ్‌ను గతేడాది విజేత ఆడుతుంది. ఆ లెక్కన ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఆర్‌సీబీ తొలి పోరుకు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మెగా ఫైట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. అంటే మొదటి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజాలను ఒకేసారి మైదానంలో చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. ఇక వరల్డ్ కప్ హీరోలైన సంజు శామ్సన్, శివం దూబే కూడా ఈ ఆరంభ మ్యాచ్‌లోనే తమ ప్రతాపం చూపించనున్నారు.

సీజన్ రెండో రోజైన మార్చి 29న గతేడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ముల్లాన్‌పూర్‌లోని తమ హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ తలపడే అవకాశం ఉంది. అలాగే మార్చి 25న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కెప్టెన్ల మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో కొత్త సీజన్ రూల్స్, ప్లేయింగ్ కండిషన్స్‌పై బోర్డు చర్చించనుంది. ఈసారి ఐపీఎల్‌లో కొన్ని కొత్త మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us