టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!
Easy Soup In Minutes: ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఆహారంలో కొంత మార్పు చేసుకుంటాం. ముఖ్యంగా పొట్టకు హాయిగా, తేలికగా ఉండే రెసిపీలను ఎక్కువగా తింటారు. ఆ లిస్ట్‌లో మజ్జిగ చారు ముందే ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లో కూడా సూపర్ టేస్టీ మజ్జిగ చారును చేసుకోవచ్చు.

Majjiga Charu
ఎండాకాలం మొదలవుతుందంటే ఆహారంలో పెద్ద మార్పులు చేసుకుంటారు ప్రజలు. ముఖ్యంగా పొట్టకు హాయినిచ్చే రెసిపీలు చేసుకుని తింటుంటారు. అయితే ఆ రెసిపీల జాబితాలో మజ్జిగ చారు ముందు వరుసలో ఉంటుంది. దీనినే పెరుగు పచ్చడి, సల్ల చారు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఈ మజ్జిగ చారును కూడా కొద్దిమంది రకరకాలుగా చేసుకుని తింటుంటారు. తాలింపులో ఉల్లిపాయలను మగ్గించి కొద్దిమంది చేస్తే, మరికొద్దిమంది అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి చేస్తుంటారు. కానీ ఇవేమి లేకుండా కేవలం 5 నిమిషాల్లో మజ్జిగ చారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా సరికొత్తగా మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు – 5 నిమిషాల్లో
కావాల్సిన పదార్థాలు:
ప్రధాన పదార్థాలు:
- పెరుగు – ½ కేజీ (తాజాగా తీసుకోవాలి)
- ఉల్లిపాయ – 1 (చిన్నగా సన్నగా కట్ చేయాలి)
- పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా)
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – తగినంత
- తాలింపు కోసం:
- నూనె – 1 టేబుల్ స్పూన్
- శనగపప్పు – 1 టీస్పూన్
- మినప్పప్పు – 1 టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- ఆవాలు – ½ టీస్పూన్
- పచ్చిమిర్చి – 2 (చీలికలు)
- ఎండుమిర్చి – 2
- పసుపు – ½ టీస్పూన్
- కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం:
పెరుగు మిక్స్ చేయడం:
- మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని విస్కర్‌తో బాగా కలిపి గట్టిగా మిక్స్ చేయండి.
- ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం వేసి అంతా సమానంగా కలపండి.
- 1 గ్లాస్ నీళ్లు పోసి మళ్లీ కలిపి పక్కన ఉంచండి.
తాలింపు తయారీ:
- స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నూనె వేసి వేడి చేయండి.
- వేడి అయిన నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగించండి.
- తాలింపులోని గింజలు బాగా ఫ్రై అయిన తరువాత, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి వేసి మరోసారి ఫ్రై చేయండి.
- చివరగా పసుపు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే మగ్గించండి.
- చారు మిక్సింగ్:
- వేడి తాలింపును పెరుగు మిశ్రమంలో పోసి బాగా కలపండి.
- మొత్తం సర్దుబాటు అయిన తర్వాత, మజ్జిగ చారు రెడీ.
చిట్కాలు:
- పెరుగును తాజా తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది.
- కొంచెం పుల్లగా కావాలంటే లైట్ పెరుగు ఉపయోగించవచ్చు.
- కారం, పచ్చిమిర్చి రుచికి అనుగుణంగా తీసుకోవాలి.
- తాలింపు బాగా వేగితేనే చారు రుచి మెరుగుపడుతుంది; ఆ తర్వాత మిక్స్ చేసిన వెంటనే టేస్టీ మజ్జిగ చారును సర్వ్ చేయండి.
Follow Us
