Telangana News: మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య.. అక్కతో కలిసి..
ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లోని మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్ చౌరస్తా వద్ద జరిగిన మర్డర్ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. మృతుడు మైలార్ దేవ్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో నివసించే బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ముంతాజ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసైనా ముంతాజ్ ఆలం తన భార్య రౌషన్ ఖాతూన్‌ను వేధించేవాడు.
హైదరాబాద్‌లోని మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 24వ తేదీన దుర్గానగర్ చౌరస్తా వద్ద జరిగిన మర్డర్ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. మృతుడు మైలార్ దేవ్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో నివసించే బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ముంతాజ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసైనా ముంతాజ్ ఆలం తన భార్య రౌషన్ ఖాతూన్‌ను వేధించేవాడు. ఈ నెల 20వ తేదీన రాత్రి ముంతాజ్ ఆలం మద్యం సేవించి మద్యం మత్తులో నిద్రిస్తూ ఉండగా అతని భార్య రౌషన్ ఖాతూన్, తన అక్క రవీనాబీబితో కలిసి బట్ట, నవర్ తాడుతో అతని గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఒక సంచిలో ముంతాజ్ ఆలం మృతదేహాన్ని కుక్కి ఈనెల 21వ తేదీన ప్యాసింజర్ ఆటోలో సంచిని వేసుకొని దుర్గ నగర్ చౌరస్తా నుండి ఆరాంఘర్ వైపుకు వెళ్లే దారిలో డ్రైనేజీలో సంచిని పడవేసివెళ్లిపోయారు. మృతుని భార్య రౌషన్ ఖాతూన్,ఆమె అక్క రవీనాబీబిను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి