దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా
పల్లెల్లో గ్రామ దేవతల జాతరలు షరా మామూలే. వీటిల్లో పొట్టేల్లు, మేకలు, కోళ్లు లెక్కకు మించి తీసుకెళ్లి గ్రామ దేవతలకు బలిచ్చే ఆచారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే తాజాగా ఆ ఊళ్లో జరుగుతున్న జాతరకు పొట్టేళ్లు కరువయ్యాయి. దీంతో సంతల్లో ఎద్దులు, ఆవులు, బర్రెలకు మించిన ధర పొట్టేళ్లు పలుకుతున్నాయి.. మారెమ్మ దేవరలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.
ఒకే ఒక్క పొట్టేలు ధర ఏకంగా రూ.1.36 లక్షలు పలికింది. అవును ఇది నిజమే.. ఎద్దులు, పాడి పశువులు పలకని ధర పొట్టేలు పలకడంతో చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ మేరకు రికార్డ్ స్థాయిలో పొట్టేలు ధర పలికింది. దీంతో సదరు పొట్టేలును చూసేందుకు భారీగా జనాలు తరలి వస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే చింతలగేని నరసారెడ్డి అనే వ్యక్తి లక్ష ముప్పై ఆరువేల రూపాయలకు ఈ పొట్టేలును కొనుగోలు చేశాడు. కోసిగిలోని కడాపాలెం నాల్గవ వార్డులోని ముసలి మారెమ్మ దేవి దేవర కోసం.. టీడీపీ టౌన్ అధ్యక్షులు చింతలగేని నర్సారెడ్డి కర్ణాటక రాష్ట్రం బాగాలకోట్ జిల్లా, అమ్మిన గడ్డ సంతలో ఈ పొట్టేలు కొనుగోలు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. బిర్యానీ తింటుండగా..
Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర