Tollywood: సీఎంతో భేటీ అనంతరం దిల్ రాజు చెప్పిన కీలక విషయాలు ఇవే

Tollywood: సీఎంతో భేటీ అనంతరం దిల్ రాజు చెప్పిన కీలక విషయాలు ఇవే

Ram Naramaneni

|

Updated on: Dec 26, 2024 | 1:58 PM

సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్‌కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు నిర్మాతలు ఉంటారు. కమిటీలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఉంటారు. ఐదుగురు లేదా ఏడుగురితో సబ్‌ కమిటీ ఏర్పాటు అవుతుంది. టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై చర్చిస్తుంది ఈ సబ్‌ కమిటీ.

టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని FDC చైర్మన్‌ దిల్‌ రాజు చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్‌ రాజు వివరించారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్‌ రాజు చెప్పారు.  ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు దిల్‌ రాజు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్.. అపోహ మాత్రమే అన్నారు. త్వరలోనే మరోసారి సీఎంతో భేటీ అవుతామని చెప్పారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు  సీఎం తమకు కొన్ని విషయాల్లో సూచనలు చేశారని వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Published on: Dec 26, 2024 01:58 PM