AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

Washing Machine: చాలా మంది ఇళ్లలో వాషింగ్‌ మెషీన్‌ ఉంటుంది. ఇది బట్టలను సులభంగా ఉతుకుతుంది. అయితే వాషింగ్‌ మెషీన్‌లో ఎలాంటి బట్టలు ఉతకవచ్చో కంపెనీ వివరిస్తుంది. ఏ బట్టలు ఏ మోడ్‌లో ఉతాక వంటి ఫీచర్‌ కూడా మెషీన్‌లో ఉంటుంది. మరి వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? టెక్‌ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

Washing Machine: వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
Subhash Goud
|

Updated on: Dec 24, 2024 | 8:30 PM

Share

చల్లని వాతావరణంలో దుప్పట్ల వాడకం గణనీయంగా పెరుగుతుంది. అది మురికిగా మారిన తర్వాత ఉతకడం, ఆరబెట్టడమే పెద్ద సమస్య. చల్లని వాతవరణంలో ఎండ తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు ఉతకడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఉతికినా త్వరగా ఆరిపోవు. ఎండలేని కారణంగా ఇది దుప్పటిని ఆరబెట్టడం మరింత కష్టతరం చేస్తుంది. దీని కోసం చాలా మంది వాషింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తారు. ఎందుకంటే వాషింగ్ మెషీన్ మందపాటి దుప్పటిని కూడా సులభంగా ఉతుకుతుంది. అది దుప్పటి రకాన్ని బట్టి వాషింగ్‌ మెషీన్‌లో వేయాలని గుర్తించుకోండి. వాషింగ్ మెషీన్‌లో దుప్పట్లు ఉతకడం సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వాషింగ్ మెషీన్‌లో దుప్పట్లను ఉతకడం సరైన మార్గం ఏమిటి ? గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం.

  1. దుప్పటి బరువు: వాషింగ్ మెషీన్‌లో దుప్పటిని వేసేముందు దాని బరువును తనిఖీ చేయండి. భారీ దుప్పట్లు అయినట్లయితే వాషింగ్‌ మెషీన్‌పై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మెషీన్‌ పాడయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా 9 కిలోల వరకు బరువున్న దుప్పట్లను వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు. కానీ బరువు తక్కువగా ఉన్నప్పటికీ వాషింగ్‌ మెషీన్‌లో సులభంగా తిరగలేదు. దీని వల్ల కూడా వాషింగ్‌ మెషీన్‌పై ఒత్తిడి పెరగవచ్చు.
  2. యంత్రం సామర్థ్యాన్ని తనిఖీ చేయండి: మార్కెట్లో లభించే వాషింగ్ మెషీన్లు వివిధ కెపాసిటీలు ఉంటాయి. మీ మెషిన్ సామర్థ్యం 7 కిలోలు, దుప్పటి బరువు 7 కిలోలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, మీరు దానిని మెషిన్ వాష్ చేయవచ్చు. దీని కోసం మెషీన్‌లో దుప్పటిని వేసిన తర్వాత అది ఒకే చోట ఉండకుండా చూసుకోవాలి. మెషీన్‌లో సులభంగా తిరిగేలా ఉండాలి. ఉతికేటప్పుడు దుప్పటిని మధ్యమధ్యలో పైకి క్రిందికి కదపడం వల్ల క్లీనింగ్ సరిగ్గా జరుగుతుంది. అలాగే ఒక వేళ వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకాలంటే తక్కువ బరువు ఉండే, అది కూడా సన్నగా ఉండే దుప్పట్లు వేయడం సురక్షిమంటున్నారు నిపుణులు.
  3. దుప్పటి మెటీరియల్‌ని తనిఖీ చేయండి: ప్రతి దుప్పటి తయారీకి వాడే పదార్థం భిన్నంగా ఉంటుంది. ఖరీదైన లేదా సున్నితమైన దుప్పట్లను ఉతకడానికి ముందు వాటిపై ఇచ్చిన సూచనలను చదవండి.

దుప్పట్లు ఉతికేటప్పుడు ఈ తప్పులను నివారించండి:

  1. బ్లీచ్ ఉపయోగించవద్దు: బ్లీచ్ దుప్పటి ఫైబర్‌లను దెబ్బతీస్తుంది. దాని నాణ్యతను తగ్గిస్తుంది.
  2. ఇవి కూడా చదవండి
  3. ఫాబ్రిక్ సాఫ్ట్‌నెర్‌లను నివారించండి: ఫాబ్రిక్ సాఫ్ట్‌నెర్‌లు దుప్పటి సహజ మృదుత్వాన్ని పాడు చేస్తాయి.
  4. ఓవర్‌లోడింగ్‌ను నివారించండి: భారీ దుప్పట్లను మెషీన్‌లోకి లోడ్ చేయకపోవడం మంచిది. దుప్పటి చాలా పెద్దది, భారీగా ఉంటే దానిని రెండు భాగాలుగా విభజించి మెషీన్‌లో వేయాలి. అది కూడా మెషీన్‌ డోర్‌ ఓపెన్‌గా ఉంచినా ఎలాంటి ఇబ్బంది లేని వాటికి మాత్రమే ఇలా చేయాలి. ముందుగా ఒక భాగాన్ని వేసి కడిగిన తర్వాత మరో భాగాన్ని తర్వాత వేయాలి. ఇది యంత్రంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. దుప్పటి కూడా పూర్తిగా శుభ్రం అవుతుంది.

నిపుణుల సలహా ఏంటంటే..

ఇంకో విషయం ఏంటంటే వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను వేయకపోవడమే మంచిదంటున్నారు టెక్‌ నిపుణులు. ఎందుకంటే వాషింగ్‌ మెషీన్‌లో వేసిన దుప్పట్ల నాణ్యత దెబ్బతింటుంది. అలాగే మెషీన్‌ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. దీంతో వాషింగ్‌ మెషీన్‌కు సంబంధించిన సూచనల, సలహాలను బుక్‌లో తెలుసుకోవడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Realme 14 Pro Series: ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే స్మార్ట్‌ ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?