Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేలు జీఎస్టీ కట్టాలా?

GST: ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు రకాల వస్తువులపై జీఎస్టీ విధిస్తూ నిర్ణయించారు. అయితే పాత కార్లపై కూడా జీఎస్టీ విధించనున్నారు. వాడిన కార్లను తిరిగి ఇతరులకు విక్రయిస్తే 12 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. 18 శాతం జీఎస్టీ ఎవరెవరికి వర్తించనుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

GST: రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేలు జీఎస్టీ కట్టాలా?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2024 | 3:05 PM

పాత ఈవీ వాహనాలపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. ఈ నిర్ణయం తర్వాత రూ.6 లక్షలకు కారు కొని ఆ తర్వాత లక్ష రూపాయలకు విక్రయించినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు రూ. 5 లక్షల మార్జిన్‌పై 18% GST చెల్లించాలి. రూ. 5 లక్షల 18%.. అంటే రూ. 90,000 పన్ను పడుతుంది. ఈ వైరల్ పోస్ట్ తర్వాత, ప్రజల్లో గందరగోళం పెరిగింది.

మీరు ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాల (EV) తిరిగి విక్రయిస్తే దానిపై 18 శాతం పన్ను విధించాలని GST కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం గందరగోళాన్ని సృష్టించింది. కార్ల రీసేల్ మార్జిన్ వాల్యూపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ ఉపయోగించిన కార్లను విక్రయించే వ్యక్తులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఉపయోగించిన కార్ల తిరిగి విక్రయించే సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వ్యక్తిగతంగా కారును విక్రయిస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదు.

ఇది కూడా చదవండి: Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

వ్యాపార సంస్థలు విక్రయించే వాడిన EVలపై 12 శాతానికి బదులుగా 18 శాతం GST విధించేందుకు ప్యానెల్ ఆమోదించింది. ఈ విషయాన్ని ఉదాహరణతో చూద్దాం.. కారును రూ.12 లక్షలకు కొనుగోలు చేసి, రూ.9 లక్షలకు విక్రయిస్తే ధరలో తేడాపై పన్ను విధిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో వినియోగదారుల్లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. కారు అమ్మితే పన్ను కట్టాల్సిందేనన్న భావన ప్రజల్లో నెలకొంది.

మరి ట్యాక్స్‌ ఎవరు చెల్లించాలి?

రీసేల్ కార్ల వ్యాపారం చేసే వెంచర్లపై అటువంటి పన్ను విధించాలనేది కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో ఉపయోగించిన EVల తిరిగి ఇతరులకు విక్రయిస్తే12 శాతం GST ఉండగా, దానిని 18 శాతానికి పెంచారు. ఈ జీఎస్టీని కూడా లాభాల మార్జిన్‌పై మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీలర్ యూజ్డ్ ఈవీ కారును రూ.9 లక్షలకు కొనుగోలు చేసి రూ.10 లక్షలకు ఇతరులకు విక్రయిస్తే, రూ.లక్ష లాభంపై మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తమ మధ్య అలాంటి లావాదేవీలు జరిగితే దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

నిపుణులు ఏమంటున్నారు..

వ్యక్తిపై GST లేదు: మీరు రూ. 18 లక్షలతో కారును కొనుగోలు చేసి, దానిని రూ. 13 లక్షలకు స్నేహితుడికి లేదా బంధువు లేదా పరిచయస్తులకు విక్రయిస్తే, అప్పుడు ఎలాంటి జీఎస్టీ ఉండదు. బిజినెస్ వెంచర్‌పై జీఎస్‌టీ: డీలర్ కారును రూ. 13 లక్షలకు కొనుగోలు చేసి రూ. 17 లక్షలకు విక్రయిస్తే, రూ. 4 లక్షల లాభాలపై మాత్రమే 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు పాత కారును కొనుగోలు చేసేటప్పుడు అది పెట్రోల్, డీజిల్ లేదా EV అయినా, మీరు లాభాల మార్జిన్‌పై 18 శాతం పన్ను చెల్లించాలి.

ఇది కూడా చదవండి: WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి